Tirumala: తిరుమలలో హోటళ్ల అద్దె తగ్గించిన టీటీడీ
ABN , Publish Date - Jun 26 , 2025 | 04:42 AM
తిరుమలలో ప్రైవేటు సంస్థలు నిర్వహించే హోటళ్ల అద్దెలను భారీగా తగ్గిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.
కొత్త నిబంధనలతో టెండర్లకు ఆహ్వానం
తిరుమల, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో ప్రైవేటు సంస్థలు నిర్వహించే హోటళ్ల అద్దెలను భారీగా తగ్గిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. మూడేళ్ల కాలపరిమితిని ఐదేళ్లకు పెంచింది. కొత్తగా ఐదు చిన్న హోటళ్లు, ఐదు పెద్ద హోటళ్ల నిర్వహణకు టెండర్లు పిలిచింది. టెండరుదారు తప్పనిసరిగా హిందువై ఉండాలని, పది హోటళ్లను నడుపుతూ ఉండాలని, ఈ రంగంలో ఐదేళ్ల అనుభవం ఉండాలని నిబంధనలు విధించింది. ఈ నెల 23న ప్రారంభమైన ఈ టెండరు ప్రక్రియ జూలై 19వ తేదీన ముగుస్తుంది.
అద్దె మార్పులు ఇలా..
నెలకు రూ.12.99 లక్షలుగా ఉన్న సప్తగిరి హోటళ్ల అద్దెను రూ.9.75 లక్షలకు తగ్గించగా,కౌస్తుభం హోటల్ అద్దె రూ.16.20 లక్షల నుంచి 12.15 లక్షలకు తగ్గించారు. ఎంఎంటీ క్యాంటీన్‌కు రూ.5.05 లక్షల అద్దెను రూ.3.80 లక్షలు, పీఏసీ(నార్త్)కు రూ.4.10 లక్షలను రూ.3.10 లక్షలకు, హెచ్‌వీసీకు రూ.3.33 లక్షల నుంచి రూ.2.50 లక్షలకు పీఏసీ(వె్‌స్ట)కు రూ.4.44 లక్షల నుంచి రూ.3.35 లక్షలకు, ఎస్‌ఎంసీ క్యాంటీన్‌కు రూ.3.88 లక్షల నుంచి రూ.2.95 లక్షలకు తగ్గించారు.