Home » TG Politics
ప్రధానమంత్రి నరేంద్రమోదీని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఉగ్రవాది (టెర్రరిస్ట్) అని సంబోధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఓ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా, సుదీర్ఘ రాజకీయ అనుభవం గల నాయకుడిగా ఖర్గేకు పేరు ఉందని ప్రస్తావించారు.
భారత రాష్ట్ర సమితి మరో ముఖ్యమైన సమావేశానికి సిద్ధమవుతోంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం, రజతోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27వ తేదీన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది.
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్‌కు కాంగ్రెస్ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలది రాహుకేతు గ్రహమని బండి సంజయ్ అంటున్నారని.. అసలు బండి సంజయ్ ఏ గ్రహమని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాకముందు ఈ ప్రాంతంలో భయంకర పరిస్థితులు ఉండేవని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. గతంలో తెలంగాణ పదం పలకడానికే భయపడే రోజులు ఉండేవని పేర్కొన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాళేశ్వరం ప్రపంచంలోనే అద్భతమని కేసీఆర్ అన్నారని పేర్కొన్నారు.
మాజీ మంత్రి కేటీఆర్‌పై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ ఫామ్‌హౌస్‌కు తాను ఏనాడూ పోలేదని స్పష్టం చేశారు.
మహిళా రిజర్వేషన్ల అమలుకు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్, ఇండియా కూటమి వ్యతిరేకం కాదని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిన్న(శనివారం) సాయంత్రం మహిళల గురించి మాట్లాడారని తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని మంత్రి వివేక్ వెంకట్ స్వామి వ్యాఖ్యానించారు. సిద్దిపేటకు ఏమైనా సమస్యలు ఉంటే ప్రత్యేక నిధుల ద్వారా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
పార్లమెంట్‌లో మహిళా బిల్లు వీగిపోవడం చీకటి రోజని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. మహిళా బిల్లు వీగిపోయిందని కాంగ్రెస్ వీర్రవీగుతోందని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాలలో పాల్గొననున్న మీటింగ్‌పై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు చేశారు. బయటకు వస్తే పులి సంగతి చెబుతామని హెచ్చరించారు.