Home » TG News
మొత్తం 2,735 చ.కి.మీటర్లతో హైదరాబాద్ నగరం విస్తరించింది. హైదరాబాద్... ఇప్పుడు అతిపెద్ద నగరం. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర కూడా వేసింది. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని, అవతల గల 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్ఎంసీ పరిధిలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించారు.
మార్కులు తక్కువ వచ్చాయని తండ్రి మందలించడంతో.. మనస్థాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద సంఘటన సికింద్రాబాద్ హబ్సిగూడలో చోటుచేసుకుంది. సిరి వైష్ణవి(15) అనే బాలిక పదో తరగతి చదువుతోంది. అయితే.. మార్కులు తక్కువగా వస్తుండడంతో తండ్రి మందలించాడు. దీంతో ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది.
తాగునీటితో కారు కడిగిన వ్యక్తికి అధాకారులు రూ.10వేల జరిమానా విధించారు. ఈ విషయం బంజారాహిల్స్‌లో జరిగింది. తాగే నీటితో వాహనాలు కడగడం కొందరికి పరిపాటిగా మారింది. దీనిపై అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. జరిమానాలు విధిస్తున్నారు.
ఈనెల 27వతేదీన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ సర్వసభ్య సమావేశం జరగనుందని మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హాజరవుతారని ఎమ్మెల్యే తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ విస్తరణకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీకి ఔటర్ రింగు రోడ్డు ఓఆర్ఆర్ను సరిహద్దుగా నిర్ణయించింది. దీంతో హైదరాబాద్ మహానగరం దేశంలోనే అతిపెద్ద నగరంగా అవతరించనుంది...
ప్రేమ విఫలమైందని మనస్తాపంతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన హైదరాబాద్ నగర శివారులో జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన కుర్ర పవన్ కళ్యాణ్‌రెడ్డి ఉద్యోగం చేస్తున్నాడు. అయితే.. ప్రేమ విఫలమైందన్న కిరణంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మహిళా స్వయం సహాయక బృందాలకు మంగళవారం వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క..
సైబర్ నేరగాళ్లు సరికొత్త పంధాను ఎంచుకున్నారు. సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో బ్యాంకులు, ప్రభుత్వ సేవల పేర్లతో సైబర్ నేరగాళ్లు ఏపీకే లింక్‌లు పంపుతున్నారు. ఈ లింక్‌లను ఓపెన్ చేస్తే.. ఖాతాలో ఉన్న నగదు మొత్తం మాయమైపోతోంది. ఈ తరహ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని పోలీస్ యంత్రాంగం సూచిస్తోంది.
రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందగా.. భార్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న విషాద సంఘటన సికింద్రాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
భాగ్యనగర వాసులకు బిగ్ అలెర్ట్.. ఈనెల 26వతేదీన కృష్ణా జలాలు బంద్ చేస్తున్నట్లు వాటర్ బోర్డు అధికారులు ప్రకటించారు. విద్యుత్ మరమ్మతు పనుల కారణంగా కృష్ణా జలాల పంపింగ్‌ను ఆరు గంటల పాటు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.