Home » terror attack
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. విదేశీయులు, భారతీయ పర్యాటకులు లక్ష్యంగా ఉగ్రవాదులు మతం అడిగి కాల్పులకు తెగబడ్డారు.
పహల్గాం ఉగ్రదాడి విషాదాన్ని భారతీయ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రాహుల్ గాంధీ తదితరులు దాడిని అమానవీయంగా మరియు దిగ్ర్భాంతికరంగా అభివర్ణించారు, ఉగ్రవాదులను వదిలిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
పహల్గాంలో ఉగ్రవాదుల దాడి మరోసారి ద్రోహాన్ని రేపింది. హిందువులు, ముఖ్యంగా పురుషులపై ఉగ్రవాదులు దాడి చేసి, వారి ప్రాణాలు తీసిన ఘటనా. హనీమూన్‌కు వచ్చిన జంట, తండ్రి ప్రాణాలను కోల్పోయిన కుమార్తె వంటి అనేక హృదయ విదారక సంఘటనలు చోటు చేసుకున్నాయి
జమ్మూకశ్మీర్‌లో పహల్గాం ఘటనతో ఉగ్రవాదం మళ్లీ కలకలం రేపింది. పర్యాటక రంగం పునరుద్ధరణలో ఉన్న సమయంలో, ఉగ్రవాదుల దాడులతో భద్రతపై ప్రశ్నలు కలుగుతున్నాయి.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 28 మంది పర్యాటకులు మరణించగా, బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఈ ఘటన వెనుక పాకిస్తాన్‌కు చెందిన లష్కర్-ఎ-తోయిబా అనుబంధ సంస్థ "రెసిస్టెన్స్ ఫ్రంట్" ఉన్నదని తెలుస్తోంది.
Pahalgam Terrorist Attack: ఆర్మీ దుస్తులు ధరించిన ఓ ఏడుగురు వ్యక్తులు పర్యాటకులపై దాడికి పాల్పడ్డారు. హిందువులే లక్ష్యంగా వారు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ దాడిలో 27 మంది చనిపోగా.. 12 మంది గాయపడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మంజునాథ్‌కు సంబంధించిన చివరి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అనంత్‌నాగ్ జిల్లాలో పహల్గాంలో పర్యటిస్తున్న టూరిస్టులపై మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఉగ్రవాదులు అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో పలువురు గాయపడ్డారు.
ఉగ్రవాదంపై పోరుకు యావద్దేశం కలిసికట్టుగా పోరాడాలని మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఉగ్రవాదంపై పోరాటానికి భారత్ కృతనిశ్చయాన్ని ఇలాంటి దుష్టశక్తుల పన్నాగాలు నీరుగార్చలేవని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
Terrorist In Pahalgam: పర్యాటకులే లక్ష్యంగా ముగ్గురు టెర్రరిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. అతి సమీపం నుంచి పర్యాటకుల్ని కాల్చి చంపారు. వారు ముస్లింలా కాదా తెలుసుకుని మరీ కాల్పులకు పాల్పడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.