Terror Attack: టూరిస్టులే టార్గెట్‌గా ఉగ్రదాడి.. 26 మంది మృతి, మోదీ ఫోన్, ఘటనా స్థలికి అమిత్‌షా
ABN , Publish Date - Apr 22 , 2025 | 06:27 PM
అనంత్‌నాగ్ జిల్లాలో పహల్గాంలో పర్యటిస్తున్న టూరిస్టులపై మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఉగ్రవాదులు అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో పలువురు గాయపడ్డారు.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ పర్యాటకులు లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు తెగబడ్డారు. అతి సమీపం నుంచి కాల్పులకు దిగడంతో 26 మంది టూరిస్టులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారని సమాచారం. క్షతగాత్రులను హుటాహుటిని హెలికాప్టర్ ద్వారా పహల్గాం ఆసుపత్రికి తరలించారు. అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలో పర్యటిస్తున్న టూరిస్టులపై మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఉగ్రవాదులు అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో పలువురు గాయపడ్డారు. హల్గావ్ హిల్ స్టేషన్‌కు సుమారు 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న బైసరాన్‌కు కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే వీలుంది.
Aircraft Crash: కుప్పకూలిన శిక్షణా విమానం.. పైలట్ మృతి
కాగా, ఉగ్రవాదుల కాల్పుల్లో తన భర్త తనకు గాయమైందని, పలువురు గాయపడ్డారని ఒక మహిళ పీటీఐ వార్తా సంస్థకు ఫోనులో తెలిపింది. తన వివరాలను ఆ మహిళ వెల్లడించనప్పటికీ క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రిలో చేర్చాలని ఆమె కోరారు. భద్రతా బలగాలను ఘటనా స్థలిని తమ అధీనంలోకి తీసుకుని ఉగ్రవాదుల కోసం గాలిస్తు్నారు. కాగా, ఈ కాల్పులకు తామే బాధ్యులమని పాకిస్థాన్ టెర్రరిస్ట్ సంస్థ లష్కరే తొయిబాకు అనుబంధంగా ఉన్న స్థానిక సంస్థ రెసిస్టెన్స్ ఫోర్స్ ప్రకటించింది.
అమిత్‌షాకు మోదీ ఫోన్
పవల్గాం ఉగ్రదాడిపై సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్రం హోం మంత్రి అమిత్‌షాకు ఫోను చేశారు. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఘటనా స్థలికి వెళ్లాలని అమిత్‌షాను ఆదేశించారు.
అమిత్‌షా అత్యున్నత స్థాయి సమావేశం
కాగా, పరిస్థితిని సమీక్షించేందుకు అధికారులతో అత్యన్నత స్థాయి సమావేశాన్ని అమిత్‌షా ఏర్పాటు చేశారు. హోం సెక్రటరీ, ఇంటెలిజెన్స్ బ్యూరో, హోం శాఖ సీనియర్ అధికారులు, జమ్మూకశ్మీర్ డీజీపీ సహా ఇతర అధికారులు ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు.
తీవ్రంగా ఖండించిన ఒమర్ అబ్దుల్లా
పర్యాటకులపై ఉగ్రవాదులు జరిగిన దాడి తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో తెలిపారు. "ఈ ఘటనను ఖండించడానికి మాటలు కూడా చాలవు. మన అతిథులపై జంతువుల్లా, అమానవీయంగా జరిపిన దాడి ఇది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులకు చికిత్స అందిస్తు్న్నాం. శ్రీనగర్‌కు తక్షణం బయలుదేరి వెళ్తున్నాను'' అని ఒమర్ ట్వీట్ చేశారు.
ఎల్జీ ఖండన
పర్యాటకులపై ఉగ్రవాదిని జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఖండించారు. పహల్గాం ఆసుపత్రిలో చేరిన వారికి తక్షణ వైద్య సహాయం అందించాల్సిందిగా జిల్లా యంత్రాగాన్ని అదేశించామని, ఒక క్షతగాత్రుని అనంతనాగ్ జీఎంసీకి తరలించామని చెప్పారు. బాధితులంతా త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తు్న్నట్టు చెప్పారు.
ఇవి కూాడా చదవండి..