Home » TDP High Command
తెలుగుదేశం పార్టీ ఈసారి నిర్వహించే మహానాడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కబోతోందని ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 1875 క్లస్టర్లలో పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగే మహానాడుతో అనుసంధానం కాబోతున్నారని పేర్కొన్నారు.
ఈసారి తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడును మరింత విజయవంతం చేద్దామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. క్లస్టర్ స్థాయిలో జరగనున్న మహానాడును విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులకు సూచించారు.
పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ బాధ్యతల్లో ఆ పార్టీ హై కమాండ్ మార్పు చేసింది.
హిందూపురం అభివృద్ధిపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే పలు కార్యక్రమాల్లో బాలయ్య పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. పాణ్యం మండలం కవులూరు గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు మునిశేషిరెడ్డి అనారోగ్యంతో (96) మృతిచెందారు.
ప్రజాప్రతినిధులు వారంలో ఒక రోజు ఖచ్చితంగా ప్రజావేదిక కార్యక్రమం ద్వారా అర్జీలు స్వీకరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నియోజకవర్గ స్థాయిలో పరిష్కారం కాని ప్రజా సమస్యలను జిల్లా స్థాయిలో, అక్కడా పరిష్కారం కానివి రాష్ట్ర స్థాయిలో పరిష్కరించాలని సూచించారు సీఎం చంద్రబాబు.
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం 11 గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పార్టీ కార్యాలయంలోనే ఉండనున్నారు.
మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ఇకపై ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహించాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆజ్ఞాపించారు. ఇక అదే రోజు స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించి నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు పల్లా శ్రీనివాసరావు .
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)ల మధ్య నెలకొన్న వివాదంపై తెలుగుదేశం పార్టీ హై కమాండ్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఇద్దరు నేతలని పిలిపించి మాట్లాడింది.
టీడీపీ నేతలకి సంబంధించిన తిరువూరు విభేదాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ లైన్ ఎవరు దాటినా సహించేది లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.