Home » Tamil Nadu
తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్దపాలయం సమీపంలోని ఎర్నాకుప్పం అగరబత్తి ఫ్యాక్టరీలో మంటలు వ్యాపించాయి. ఈ ఫ్యాక్టరీలో ఆకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి.
తమిళనాడు మూడు ప్రధాన ప్రకృతి వైపరీత్యాలను చవిచూసిందని, ఏ సందర్భంలోనూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రానికి రావడం కానీ, నిధులు ఇవ్వడం కానీ చేయలేదని స్టాలిన్ విమర్శించారు. ఇప్పుడు మాత్రం కరూర్‌కు ఆఘమేఘాల మీద వచ్చారని మండిపడ్డారు.
పెద్ద సంఖ్యలో వచ్చే ప్రజల కోసం తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత లేదా? టీవీకే పార్టీ నిర్వాహకులను హైకోర్టు ప్రశ్నించింది. 'ఈవెంట్ నిర్వాహకులుగా ప్రజల పట్ల మీకు బాధ్యత లేదా' అని కోర్టు ప్రశ్నించింది.
విజయ్ ర్యాలీలో తొక్కిసలాటపై సీబీఐ దర్యాప్తు కోరుతూ భారతీయ జనతా పార్టీ నేత ఉమా ఆనందన్ వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. టీవీకే నేతలు ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటషన్లపై ఆదేశాలను జస్టిస్ సెంథిల్ కుమార్ రిజర్వ్ చేశారు.
స్టార్ హీరోయిన్ త్రిషా చెన్నై నగరంలోని సెనోటాఫ్ రోడ్ వద్ద నివసిస్తున్నారు. ఇది సీఎం స్టాలిన్ నివసించే రోడ్డుకు సమీపంలో ఉండటంతో.. ఆ ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు.
ఉదయం నుంచే జనం సభకు చేరినప్పటికీ ఉద్దేశపూర్వకంగానే విజయ్ రాత్రి ఏడు గంటలకు రావడం, ఆయన చూసేందుకు జనం ఎగబడటం తొక్కిసలాటకు కారణమని పోలీసులు ఆరోపిస్తున్నారు. అయితే నిర్వాహకులు ఈ వాదనను కొట్టివేస్తున్నారు.
వాహనాల రాకపోకలతో రద్దీగా ఉన్న రోడ్డుపై ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో..
కరూర్ తొక్కిసలాట దుర్ఘటనను అడ్డుపెట్టుకుని ఏ రాజకీయ పార్టీ రాజకీయ లబ్ధికోసం పాకులాడొద్దని డీఎంకే మహిళా నేత, తూత్తుకుడి ఎంపీ కనిమొళి విఙ్ఞప్తి చేశారు. ఇదే విషయంపై ఆమె మంగళవారం మాట్లాడుతూ, తొక్కిసలాట జరిగిన సమయంలో అత్యంత దయనీయ పరిస్థితులు నెలకొన్నాయన్నారు.
కరూర్‌లో టీవీకే అధినేత విజయ్ ప్రచారం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సరైన భద్రత కల్పించలేదని, విద్యుత్ సరఫరాను నిలిపేశారని, ఉద్దేశపూర్వకంగా ప్రచారమార్గంలో అంబులెన్సులను నడిపారంటూ వస్తున్న విమర్శలకు ప్రభుత్వ ఉన్నతాధికారులు సమాధానం చెప్పారు.
ఇటీవల ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్ కరూర్ పర్యటన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందగా, పలువురు గాయపడిన వ్యవహారం రాష్ట్రంలో ఇంకా నిప్పు రాజేస్తూనే వుంది. ఈ దుర్ఘటన ద్వారా లబ్ధి పొందేందుకు అన్ని పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలు పన్నుతుండడంతో మరిన్ని కొత్త వివాదాలకు కారణమవుతోంది.