Chennai News: దంత వైద్యురాలి ఆత్మహత్య.. కారణం ఏంటంటే..
ABN , Publish Date - Oct 31 , 2025 | 11:46 AM
వివాహం చేసుకునేందుకు ఇష్టం లేని దంతవైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కళ్లకుర్చి జిల్లాలో చోటుచేసుకుంది. తిరుకోవిలూర్ సందైపేట సుబ్రమణ్యనగర్ ప్రాంతానికి చెందిన కృష్ణన్ కుమార్తె అమృతవర్షిణి (24) దంత వైద్యురాలిగా పనిచేస్తోంది.
- వివాహం ఏర్పాట్లలో తల్లిదండ్రులు.. దంత వైద్యురాలి ఆత్మహత్య
చెన్నై: వివాహం చేసుకునేందుకు ఇష్టం లేని దంతవైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కళ్లకుర్చి జిల్లాలో చోటుచేసుకుంది. తిరుకోవిలూర్ సందైపేట సుబ్రమణ్యనగర్ ప్రాంతానికి చెందిన కృష్ణన్ కుమార్తె అమృతవర్షిణి (24) దంత వైద్యురాలిగా పనిచేస్తోంది. ఆమెకు వివాహం చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. తనకు ఇప్పుడే వివాహం వద్దని ఆమె కోరినా, తల్లిదండ్రులు ఆమెకు వివాహ ఏర్పాట్లు చేపట్టారు.

దీంతో, మనస్తాపం చెందిన అమృతవర్షిణి(Amrutha Varshini) ఘటన జరిగిన రోజున, ఇంటి మేడ మీద గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న తిరుకోవిలూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి, ఘటనపై కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుఫానును ఆపలేం... నష్టం తగ్గించాం
Read Latest Telangana News and National News