Home » T20 World Cup
ఇప్పటివరకు ప్రయోగాత్మకంగా అమల్లో ఉన్న స్టాప్ క్లాక్ నిబంధనను టీ-20 వరల్డ్ కప్ నుంచి పూర్తి స్థాయిలో ఐసీసీ అమలు చేయనుంది. అటుపై వన్డేలు, టీ-20ల్లో ఈ నిబంధన అమలవుతుందని ఐసీసీ శుక్రవారం ప్రకటించింది.
భారత్, పాకిస్థాన్(India vs Pakistan) క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు జరిగినా కూడా ఆ క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గదనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే నెల రోజుల తర్వాత జరగనున్న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ టిక్కెట్ల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
జూన్ 2 నుంచి అమెరికా, వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానుంది. మొత్తం 20 జట్లు పాల్గొనే ఈ ప్రపంచకప్‌లో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడనుంది. టీ20 ప్రపంచకప్‌నకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.
టీ 20 వరల్డ్ కప్ సిరీస్‌కు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సారథ్యం వహిస్తాడని బీసీసీఐ సెక్రటరీ జై షా స్పష్టంచేశారు.
టీమిండియా యంగ్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ గత నెల రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. దక్షిణాఫ్రికా టూర్‌లో విరామం కోరిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌కు బీసీసీఐ కూడా మద్ధతిచ్చింది. అయితే భారత్ తిరిగొచ్చిన ఇషాన్ కిషన్ దేశవాళీ క్రికెట్‌లో ఆడకపోవడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
T20 World Cup 2024: క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమైంది ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సిరీస్. తాజాగా టీ20 వరల్డ్ కప్‌కు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. జూన్ 2 నుంచి 29వ తేదీ వరకు జరుగున్న ఈ టోర్నమెంట్‌కు సంబంధించి టికెట్లను జారీ చేసింది ఐసీసీ. పబ్లిక్ టిక్కెట్ బ్యాలెట్ విధానంలో విక్రయిస్తున్నారు.
T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు తలపడుతుండగా.. నాలుగు గ్రూపులుగా ఐసీసీ విభజించింది. గ్రూప్-ఎలో భారత్, పాకిస్థాన్, ఐర్లాండ్, కెనడా, అమెరికా ఉన్నాయి. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్ ఉన్నాయి. గ్రూప్-సిలో న్యూజిలాండ్, ఆప్ఘనిస్తాన్, వెస్టిండీస్, ఉగాండ, పపువా న్యూగినియా ఉన్నాయి. గ్రూప్-డిలో దక్షిణాఫ్రికా, శ్రీలంక, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, నేపాల్ ఉన్నాయి.
T20 World Cup 2024: వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ ఆడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఐపీఎల్‌లో రిషబ్ పంత్ ఆడితే.. ఆ తర్వాత జరిగే టీ20 ప్రపంచకప్ కోసం అతడిని కచ్చితంగా సెలక్టర్లు పరిగణనలోకి తీసుకుంటారు. ఇదే నిజమైతే.. వన్డే ప్రపంచకప్‌లో రాణించిన సీనియర్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ పరిస్థితేంటని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) రికార్డును చంద్రయాన్ 3(Chandrayan 3) బద్దలుకొట్టింది. చంద్రయాన్ 3కి విరాట్ కోహ్లికి రికార్డు సంబంధమేంటనే అనుమానం మీకు రావొచ్చు. కానీ.. ఇది నిజమే.
భారత క్రికెట్ జట్టు 1983 ప్రపంచకప్ గెలిచి ఆదివారానికి 40 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా క్రికెట్ అభిమానులు నాటి తీపి జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒకటే. అదేటంటే ప్రస్తుతం ఉన్న టీమిండియాకు ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌ను గెలిచే సత్తా ఉందా? ఈ క్రమంలో భారత అభిమానులు 1983లోని కపిల్ దేవ్ నాయకత్వంలోని టీమిండియాను, ప్రస్తుత 2023లోని రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియాను పోల్చి చూస్తున్నారు.