Home » Supreme Court
సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. హైకోర్టుల్లో తీర్పుల ఆలస్యానికి చెక్ పెట్టింది. తీర్పులు రిజర్వ్‌లో ఉంచడంపై హైకోర్టులకు సుప్రీంకోర్టు కఠినమైన 'బైండింగ్' మార్గదర్శకాలను జారీ చేసింది.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియకు భారత అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సాధారణ సవరణ ప్రక్రియకు భిన్నంగా ఉందన్న కారణంతో ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపివేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
భూ వివాదంలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI)కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై 'స్టే' ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ లీక్ కేసుపై అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. గత వైఫల్యాల నుంచి గుణపాఠం నేర్వకపోవడంపై ఎన్‌టీఏ తీరును తప్పుపట్టింది.
నటి ట్విష శర్మ అనుమానాస్పద మృతి కేసును సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించిన సంగతి తెలిసిందే. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మాసనం సోమవారం ఈ కేసుపై విచారణ జరిపింది.
పాస్టర్ చింతాడ ఆనంద్ ఎస్సీ హోదా రద్దయ్యింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఆయన ఎస్సీ హోదాను అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు బాపట్ల కలెక్టర్ వినోద్ కుమార్.. చింతాడ ఆనంద్ ఎస్సీ హోదాను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
దేశవ్యాప్తంగా నానాటికీ పెరిగిపోతున్న చిన్నారుల అదృశ్యం కేసులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశంలో దాదాపు 47,000 మంది చిన్నారుల ఆచూకీ లభించకుండా పోయిందని, ప్రతి ఏటా ఈ సంఖ్య పెరుగుతుండటంపై తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చింది.
వెనకబడిన తరగతుల్లోని ఆర్థికంగా, విద్యాపరంగా ఉన్నత స్థితిలో ఉన్న కుటుంబాలకు చెందిన పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
దేవాలయాలపై ప్రభుత్వాల నియంత్రణ చట్టాలపై విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దక్షిణ భారతదేశంలోని హిందూ దేవాలయాలను ప్రభుత్వాలు తమ అధీనంలో ఉంచుకోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన కీలక పిటిషన్ల విచారణకు అత్యన్నత న్యాయస్థానం శుక్రవారంనాడు అంగీకరించింది.
దేశంలో రిజర్వేషన్ల ఫలాలు అందుకొని సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరిన కుటుంబాలు.. తరతరాలుగా అదే కోటాను కోరుకోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తల్లిదండ్రులు ఇద్దరూ ఐఏఎస్ అధికారులై, ప్రభుత్వ సర్వీసుల్లో ఉంటూ పూర్తి స్థాయిలో స్థిరపడినప్పుడు, ఇక వారి పిల్లలకు రిజర్వేషన్ల కోటా ఎందుకని ప్రశ్నించింది.