Home » South Africa
ఉగాండా తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటూ ఉంది. కరమోజా సబ్ రీజన్‌లోని ప్రజలు ఆహార కొరతతో అల్లాడుతున్నారు. చాలా మంది దాతల సాయంతోటే కడుపు నింపుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఓ సంఘటన సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భారత మహిళా జట్టు విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) చారిత్రక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తొలిసారి ఓ విదేశీ వ్యక్తిని భారత జట్టుకు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్‌గా నియమించబోతున్నట్లు తెలుస్తోంది.
దక్షిణాఫ్రికాలో నిర్వహించనున్న జీ20 సదస్సును బహిష్కరిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం సంచలనంగా మారింది. అమెరికా తరఫున ఒక్క అధికారి కూడా జీ20 సదస్సుకు హాజరు కాబోరని ట్రంప్ ప్రకటించడంపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం మండిపడింది.
ఫైసలాబాద్ లో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో వన్డేలో 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో పాక్ సొంతం చేసుకుంది. సొంతగడ్డపై సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ను పాకిస్తాన్ కైవం చేసుకోవడం ఇదే తొలిసారి. అంతేకాకుండా ప్రోటీస్ జట్టుతో ఐదు వన్డే సిరీస్‌లు జరగ్గా.. పాక్‌కు ఇది నాలుగో విజయం.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న అనధికారిక టెస్టు మ్యాచులో టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్ ధ్రువ్ జురెల్ తన కెరీర్ లోనే అత్యుత్తమ ఫామ్ ను కనబరుస్తున్నాడు. ఈ టెస్టులో జురెల్ సెంచరీ మోత మ్రోగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో తన సూపర్ జెంచరీతో జట్టును ఆదుకున్న జురెల్.. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లోనూ మరో శతకం చేశాడు.
భారత-ఏ జట్టును ప్రకటించే ముందు టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై పలు వార్తలు వచ్చాయి. అనధికారిక వన్డే సిరీస్ లో వీరిద్దరు ఆడుతారని ప్రచారం జరిగింది. కానీ ఈ ఇద్దరు ప్లేయర్లు ఎంపికవ్వలేదు.
ఇండియా, సౌతాఫ్రికా మహిళల ప్రపంచ వరల్డ్ కప్-2025 క్రికెట్ మ్యాచ్ రసవత్తరంగా మెుదలైంది. ఏడు సార్లు వరల్డ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను సెమీ ఫైనల్ లో మట్టి కరిపించిన ఇండియా జట్టు ఫైనల్ కు దూసుకెళ్లింది. ఇప్పటివరకూ ఈ రెండు జట్లు వరల్డ్ కప్పును సొంతం చేసుకోలేదు. తాజా మ్యాచ్ తో వరల్డ్ కప్ ఏ జట్టు సొంతం చేసుకుంటుందో అనే అని ఉత్కంఠ క్రికెట్ అభిమానుల్లో పెరిగిపోయింది. ఈ మ్యాచ్ కు సంబంధించి బాల్ టు బాల్ అప్డేట్ కోసం ఇక్కడ చూడండి..
మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా నవంబర్ 2న సౌతాఫ్రికాతో తలపడనుంది. సెమీస్‌లో ఆసీస్‌పై చూపించిన దూకుడు పునరావృతమైతే భారత్ తొలిసారి ట్రోఫీని ముద్దాడే అవకాశం ఉంది. లారా వాల్వార్ట్, కాప్ వంటి సఫారీ స్టార్‌లను నిలువరించడమే కీలకం.
బుధవారం జరిగిన తొలి సెమీఫైనల్ లో సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్ జట్టును కెప్టెన్ లారా వోల్వార్డ్ ముందుండి నడిపించింది. ఆమె ఇన్నింగ్స్(169 పరుగులు) అద్భుతంగా ఉంది . పవర్ ప్లే అంతటా ఆమె స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది.
మహిళా క్రికెట్ ప్రపంచకప్ 2025లో ఆస్ట్రేలియా క్రికెటర్ సంచలనం సృష్టించింది. నిన్న(శనివారం) ఇండోర్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ అలానా కింగ్ 7 వికెట్లతో అదరగొట్టింది. ఆమె స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న ప్రోటీస్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. ఆమె దెబ్బకు సౌతాఫ్రికా బ్యాటర్లు పెవిలియన్ క్యూకట్టారు.