IND VS SA: సెంచరీలతో చెలరేగిన సౌతాఫ్రికా ఓపెనర్లు.. భారత్ ముందు భారీ టార్గెట్
ABN , Publish Date - Nov 19 , 2025 | 03:07 PM
రాజ్ కోట్ వేదికగా ఇండియా ఏ తో జరుగుతున్న మ్యాచ్ లో సౌతాఫ్రికా ఏ జట్టు భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు సెంచరీలతో చెలరేగడంతో భారత్ ముందు 326 పరుగుల భారీ టార్గెట్ ఉంది.
రాజ్‌కోట్ వేదికగా భారత్ ఏ, దక్షిణాఫ్రికా ఏ జట్ల(ndia A vs South Africa A) మధ్య మూడో అనధికారిక వన్డే మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ దిగిన సౌతాఫ్రికా ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 325 పరుగుల భారీ స్కోర్ చేసింది. సఫారీ జట్టు బ్యాటర్లలో ఓపెనర్లు ఇద్దరూ సెంచరీలతో అదరగొట్టారు. లువాన్ డ్రే ప్రిటోరియస్( Pretorius century) (123; 98 బంతుల్లో, 9 ఫోర్లు, 6 సిక్స్‌లు), రివాల్డో మూన్సామి (107; 130 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారత్ బౌలర్లపై విరుచుకపడ్డారు.
ఓపెనర్లు ఇద్దరూ తొలి వికెట్‌కు రికార్డ్ స్థాయిలో 241 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత డెలానో పాట్జీటర్ 30* పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఓపెనర్లు లువాన్, మూన్సామి(Moonsamy century) చెలరేగడంతో ప్రొటీస్ జట్టు 325 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. లేకుంటే తక్కువ స్కోర్ కే పరిమితమయ్యేది. ఇక ఆ భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా తలో రెండు వికెట్లు తీసుకున్నారు. అనంతరం భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా ఏ జట్టు కష్టాల్లో ఉంది.
మూడో వన్డేలో అభిషేక్ శర్మ(Abhishek Sharma) విఫలయ్యాడు. కేవలం 11 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. సూపర్ ఫామ్ లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ కూడా ఈ వన్డేలో దారుణంగా విఫలమయ్యాడు. అతడు 30 బంతుల్లో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(Tilak Varma) కూడా 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మోర్కీ బౌలింగ్ లో ఔటయ్యాడు. ప్రస్తుతం14 ఓవర్లు ముగిసే సరికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 70 పరుగుల చేసింది.
ఇవి కూడా చదవండి:
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి