IND VS SA 2nd Test: నిలకడగా ఆడుతున్న సౌతాఫ్రికా బ్యాటర్లు.. స్కోర్ ఎంతంటే?
ABN , Publish Date - Nov 22 , 2025 | 02:37 PM
గువాహటి వేదికగా సౌతాఫ్రికా, భారత్ మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. టాస్ గెలిచిన ప్రొటీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుని.. నిలకడగా రాణిస్తోంది.
శనివారం సౌతాఫ్రికా, టీమిండియా మధ్య రెండో టెస్టు(South Africa vs India 2nd Test) ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో ప్రొటీస్ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. ఓపెనర్లు ఐడెన్ మార్ర్కమ్, ర్యాన్ రికెల్టన్ కలిసి ఆచితూటి ఆడారు. తొలి వికెట్ కు వీరిద్దరు 161 బంతుల్లో 82 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇక ఆరంభం నుంచి వికెట్లు తీసేందుకు టీమిండియా స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా ఇబ్బంది పడ్డాడు. అయితే ఎట్టకేలకు టీ విరామం సమయానికి ముందు మార్క్రమ్ ను పెవిలియన్ పంపాడు. బ్రేక్‌కు వెళ్లి వచ్చిన వెంటనే స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) మ్యాజిక్ చేశాడు. ర్యాన్ రికెల్టన్‌ను అవుట్ చేసి భారత్ కు రెండో వికెట్ అందించాడు. ఏదేమైనా ఓపెనర్ల 82 పరుగుల భాగస్వామ్యం కారణంగా దక్షిణాఫ్రికా శుభారంభమే లభించింది.
ఇక ఓపెనర్లు అవుటైన తర్వాత వన్‌డౌన్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్, కెప్టెన్ తెంబా బవుమా నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును నెమ్మదిగా ముందుకు నడిపించారు. ఫలితంగా లంచ్ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా 55 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. స్టబ్స్ 82 బంతుల్లో 32, బవుమా 86 బంతుల్లో 36 పరుగులతో క్రీజులో నిలిచారు. లంచ్ విరామం తర్వాత రవీంద్ర జడేజా భారత్ కు మూడో వికెట్ అందించాడు. కెప్టెన్ టెంబా బవుమాను 41 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద పెవిలియన్ పంపాడు. భారత బౌలర్లలో పేసర్ బుమ్రా(Bumrah wickets), స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా(Jadeja) తలో వికెట్ దక్కించుకున్నారు. కాగా భారత్- సౌతాఫ్రికా మధ్య గువాహటి వేదికగా శనివారం రెండో టెస్టు మొదలైంది. బర్సపరా స్టేడియంలో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని నిలకడగా సాగుతోంది.
ఫస్ట్ టైమ్ ఇలా:
కాగా టెస్టు క్రికెట్ చరిత్రలో డే మ్యాచ్‌లో ముందుగా టీ విరామం ఇచ్చి.. తర్వాత లంచ్ బ్రేక్ ఇవ్వడం ఇదే తొలిసారి. అస్సాం రాష్ట్రంలోని గువాహటిలో సూర్యోదయం, సూర్యాస్తమయం కాస్తా తేడాగా ఉంటాయి. వీటి అనుగుణంగా టైమింగ్స్ ఇలా సెట్ చేశారు. ప్రస్తుతం సౌతాఫ్రికా స్కోర్ 61 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.
ఇవీ చదవండి:
స్మృతిని సర్‌ప్రైజ్ చేస్తూ పలాశ్ ప్రపోజ్.. వాహ్ అనాల్సిందే.!
ఆ స్థానంపై ప్రయోగాలెందుకు?: ఆకాశ్ చోప్రా