IND vs SA: తొలి రోజు సౌతాఫ్రికాదే ఆధిపత్యం.. స్కోర్ ఎంతంటే?
ABN , Publish Date - Nov 22 , 2025 | 06:28 PM
భారత్ తో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు సౌతాఫ్రికా ఆధిపత్యం చెలాయించింది. ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయి.. 247 పరుగులు చేసింది.
ఇంటర్నెడెస్క్: గువాహటి వేదికగా శనివారం భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో టెస్టు( IND vs SA 2nd Test) ప్రారంభమైంది. ఇక మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా మంచి స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల కోల్పోయి.. 247 పరుగులు చేసింది. ప్రస్తుతం ముత్తుసామి (25*), కైల్ వెరినె (1*) క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో మార్క్రమ్ (38), రికెల్‌టన్ (35), ట్రిస్టన్ స్టబ్స్ (49) టెంబా బావుమా (41) రాణించారు. టోనీ డి జోర్జి 28 పరుగులు చేశాడు. ఇక టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3(Kuldeep Yadav 3 wickets), జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, సిరాజ్ తలొ వికెట్ తీశారు.
శనివారం మ్యాచ్ ప్రారంభంలోనే బుమ్రా(Bumrah ) బౌలింగ్‌లో (6.2 ఓవర్ వద్ద) మార్క్రమ్‌కు లైఫ్‌లైన్ దక్కింది. మార్క్రమ్ పరుగుల ఖాతా తెరవకముందే అతడు ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కేఎల్ రాహుల్ మిస్ చేశాడు. తర్వాత మార్క్రమ్ , రికెల్‌టన్ జోడీ(Markram Rickelton partnership) నిలకడగా ఆడింది. తొలి వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. సరిగ్గా టీ విరామానికి ముందు బుమ్రా వేసిన అద్భుతమైన యార్కర్‌కు మార్క్రమ్ బౌల్డ్ అయ్యాడు. రెండో సెషన్‌లో మొదలయ్యాక కుల్దీప్ వేసిన తొలి ఓవర్‌లోనే రికెల్టన్.. వికెట్‌కీపర్ పంత్‌కు క్యాచ్ ఇచ్చాడు. అనంతరం స్టబ్స్, బావుమా నిలకడగా ఆడి రెండో సెషన్‌లో మరో వికెట్ పడకుండా చూసుకున్నారు.
దీంతో లంచ్ బ్రేక్ టైమ్ కు ప్రొటీస్ జట్టు 156/2తో నిలిచింది. ఇక చివరి సెషన్‌లో సౌతాఫ్రికా నాలుగు వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేశారు. లంచ్ బ్రేక్ తర్వాత జడేజా బౌలింగ్‌లో కెప్టెన్ టెంబా బావుమా(Temba Bavuma).. జైస్వాల్‌కు క్యాచ్ పెవిలియన్ చేరాడు. తర్వాత స్వల్ప వ్యవధిలో స్టబ్స్, వియాన్ ముల్డర్ (13)ని కుల్దీప్ ఔట్ చేశాడు. మరికాసేపట్లో ఆట ముగుస్తుందనగా.. సిరాజ్ బౌలింగ్‌లో జోర్జి.. పంత్‌కు క్యాచ్ పెవిలియన్ చేరాడు. ఒక జట్టు ఇన్నింగ్స్‌లో టాప్-4 బ్యాటర్లు 35 కంటే ఎక్కువ పరుగులు చేసినా అందులో ఒక్కరూ కూడా అర్ధ సెంచరీ చేయకపోవడం టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి.
ఇవీ చదవండి:
Ashes 2025: యాషెస్ చరిత్రలో 100 ఏళ్ల రికార్డు బద్దలు..
ఆ స్థానంపై ప్రయోగాలెందుకు?: ఆకాశ్ చోప్రా