Ashes 2025: యాషెస్ చరిత్రలో 100 ఏళ్ల రికార్డు బద్దలు..
ABN , Publish Date - Nov 22 , 2025 | 04:44 PM
పెర్త్ వేదికగా తొలి టెస్టుతో యాషెస్ సిరీస్ ప్రారంభమైంది. శుక్రవారం ప్రారంభమైన ఈ టెస్టులో.. తొలి రోజే 100 ఏళ్ల రికార్డు బద్దలైంది.
ఇంటర్నెట్ డెస్క్: యాషెస్ సిరీస్ (Ashes 2025)లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య పెర్త్ వేదికగా తొలి టెస్ట్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆసీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి టెస్టు కేవలం మూడు రోజుల్లోనే ముగిసింది. పెర్త్ టెస్ట్ మొదటి రోజు అసాధారణ రీతిలో చరిత్ర సృష్టించింది. తొలి రోజైన శుక్రవారం బౌలర్ల ఆధిపత్యమే నడిచింది. ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ 7 (Mitchell Starc 7 wickets)వికెట్లతో విజృంభించగా.. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ కేవలం 6 ఓవర్లలోనే 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో టెస్ట్ క్రికెట్‌లో అరుదైన రికార్డు నమోదైంది. మొదటి రోజు ఆటలో ఏకంగా 19 వికెట్లు పడ్డాయి.
100 ఏళ్ల రికార్డు బ్రేక్:
తొలి టెస్టులో 100 ఏళ్ల రికార్డు బద్దలైంది. యాషెస్ సిరీస్ చరిత్రలో గత 100 ఏళ్లలో టెస్ట్ మ్యాచ్ తొలి రోజే 19(, Perth Test 19 wickets) వికెట్లు పడటం ఇదే తొలిసారి. 2005లో యాషెస్ సిరీస్ లో భాగంగా లార్డ్స్ లో జరిగిన టెస్టులో తొలి రోజే 17 వికెట్లు నేలకూలాయి. ఆస్ట్రేలియా 10, ఇంగ్లాండ్ వి 7 వికెట్లు పడ్డాయి. దాదాపు వందేళ్ల తర్వాత ఆ రికార్డు బ్రేక్ అయింది. అంతకుముందు 1909లో ఓల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో మొదటి రోజున 18 వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత పెర్త్‌లో ఒక టెస్ట్ మొదటి రోజు అత్యధిక వికెట్లు పడటం కూడా ఇదే తొలిసారి. గతంలో ఇదే వేదికగా 2024లో భారత్(Team India)-ఆస్ట్రేలియా మ్యాచ్‌లో 17 వికెట్లు పడ్డాయి.
పెర్త్‌లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు వికెట్లు:
2025: 19 (ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్)
2024: 17 (ఆస్ట్రేలియా vs ఇండియా)
2018-23: 15 (నాలుగు టెస్టులు)
గత 100 ఏళ్లలో యాషెస్ టెస్ట్‌లో తొలి రోజున అత్యధిక వికెట్లు:
పెర్త్ స్టేడియం 2025- 19 వికెట్లు (ఇంగ్లాండ్ 10, ఆస్ట్రేలియా 9)
ట్రెంట్ బ్రిడ్జ్ 2001- 17 వికెట్లు (ఇంగ్లాండ్ 10, ఆస్ట్రేలియా 7)
లార్డ్స్ 2005- 17 వికెట్లు (ఆస్ట్రేలియా 10, ఇంగ్లాండ్ 7)
ఇవీ చదవండి:
స్మృతిని సర్‌ప్రైజ్ చేస్తూ పలాశ్ ప్రపోజ్.. వాహ్ అనాల్సిందే.!
ఆ స్థానంపై ప్రయోగాలెందుకు?: ఆకాశ్ చోప్రా