Senuran Muthusamy: పడిలేచిన కెరటంలా సౌతాఫ్రికా ప్లేయర్ ముత్తుసామి
ABN , Publish Date - Nov 24 , 2025 | 10:29 AM
గువాహటి వేదికగా దక్షిణాఫ్రికా, భారత్ మధ్య రెండో టెస్టు జరుగుతోంది. తొలి రోజు 6 వికెట్లు తీసిన భారత్.. రెండో రోజు తొలి సెషన్ లోనే మిగిలిన వికెట్లు తీస్తుందని అంతా భావించారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. సెనురాన్ ముత్తుసామి సౌతాఫ్రికా జట్టుకు గోడలా నిలబడ్డాడు
పడిన చోటే నిలబడితే.. ఆ కిక్కు వేరే ఉంటాది. అంతేకాక ప్రపంచం కూడా మనల్ని ప్రత్యేకంగా గుర్తిస్తుంది. అలా కాకుండా నిరాశ చెంది.. వెనుకడుగు వెస్తే.. చరిత్రలో మనకంటూ గుర్తింపు ఉండదు. ఇలా పడిలేచిన కెరటంలా నిలబడిన వాళ్లు ఎందరో ఉన్నారు. తాజాగా ఇండియా, సౌతాఫ్రికా సిరీస్ లో కూడా ఓ వ్యక్తి.. అలానే వెలుగులోకి వచ్చాడు. ఆయనే దక్షిణాఫ్రికా ప్లేయర్ సెనురాన్ ముత్తుసామి(Senuran Muthusamy). గువాహటి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఈయన పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది. కారణం.. రెండో టెస్టు(IND VS SA) గెలిచి.. సిరీస్ ను సమం చేయాలని భావించిన టీమిండియాపై ముత్తుసామి నీళ్లు చల్లాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
గువాహటి వేదికగా దక్షిణాఫ్రికా, భారత్ మధ్య రెండో టెస్టు జరుగుతోంది. తొలి రోజు 6 వికెట్లు తీసిన భారత్.. రెండో రోజు తొలి సెషన్ లోనే మిగిలిన వికెట్లు తీస్తుందని అంతా భావించారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. సెనురాన్ ముత్తుసామి(Senuran Muthusamy Performance) సౌతాఫ్రికా జట్టుకు గోడలా నిలబడ్డాడు. భారత్ బౌలర్లను విసిగించాడు. అంతేకాక 206 బంతుల్లో 109 పరుగులు చేసి.. ప్రొటీస్ జట్టుకు భారీ ఆధిక్యం రావడంలో కీలక పాత్ర పోషించాడు. ముత్తుసామి సూపర్ బ్యాటింగ్ తో భారత్ విజయం మాట పక్కనపెడితే.. డ్రా కోసం ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దక్షిణాఫ్రికా బౌలింగ్ ఆల్‌రౌండర్ పేరు చూస్తే భారత మూలాలున్నాయని అర్థమైపోతుంది.
సెనురాన్ ముత్తుసామి(Senuran Muthusamy) తల్లిదండ్రుల స్వస్థలం తమిళనాడులోని నాగపట్నం ప్రాంతం. అయితే ముత్తుసామి పుట్టకముందే అతడి ఫ్యామిలీ దక్షిణాఫ్రికా(South Africa) వెళ్లి స్థిరపడింది. ముత్తుసామి తండ్రి అతణ్ని క్రికెట్లోకి తీసుకొచ్చాడు. చిన్న వయసులోనే సెనురాన్ ఆటలో బాగా రాటుతేలాడు. తన 11వ ఏటనే తండ్రిని కోల్పోవడంతో ఒక్కసారిగా జీవితంలో అయోమయం నెలకొంది. తన తండ్రి లేకపోయినా ఆయన కోరికను తీర్చాలని ముత్తుసామి బలంగా సంకల్పించాడు. రోజూ అయిదారు గంటలకు తక్కువ కాకుండా క్రికెట్ సాధన చేసేవాడు. నిత్యం యోగా చేయడం, తరచుగా గుడికి వెళ్లడం అతడికి ఇష్టమైన అలవాట్లు.
ఇవీ చదవండి:
అంధ మహిళల టీ20 ప్రపంచకప్ భారత్‌దే.. జట్టుపై అభినందనలు..
Mohsin Naqvi: పాకిస్థాన్‌కు ఆసియా కప్ ట్రోఫీని అందజేసిన నఖ్వీ