Mohsin Naqvi: పాకిస్థాన్‌కు ఆసియా కప్ ట్రోఫీని అందజేసిన నఖ్వీ
ABN , Publish Date - Nov 24 , 2025 | 09:40 AM
మోహ్సిన్ నఖ్వీ.. ఆసియా కప్ 2025లో భారత్ విజేతగా నిలిచిన తరువాత బాగా వైరల్ అయిన పేరు. ఏసీసీ ఛైర్మన్ గా ఉన్న నఖ్వీ.. భారత్ కు ట్రోఫీ ఇవ్వలేదు. తాజాగా పాకిస్థాన్-ఏ జట్టు ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025లో విజేతగా నిలవడంతో నఖ్వీ మరోసారి వార్తల్లో నిలిచాడు.
ఇటీవల ఆసియా కప్(Asia Cup 2025) లో భారత్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్(Pakistan) ను టీమిండియా చిత్తుగా ఓడించింది. అదే సమయంలో ట్రోఫీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్, పీసీబీ ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీ చేతులు మీదుగా తీసుకునేందుకు భారత్ నిరాకరించింది. నఖ్వీ కూడా ట్రోఫీని ఏదో ఒక విధంగా భారత్ జట్టుకు అందించేందుకు నిరాకరించాడు. తన చేతులు మీదుగా తీసుకోనందుకు.. ఆ ట్రోఫీని తన వద్దే పెట్టుకున్నాడు. ఇలా టీమిండియాకు ఆసియా కప్ ట్రోఫీ ఇచ్చేందుకు నిరాకరించిన నఖ్వీ(Mohsin Naqvi).. తాజాగా పాకిస్థాన్ కు మాత్రం అందజేశాడు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...
ఆదివారం జరిగిన ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 ఫైనల్ మ్యాచ్( Pakistan vs Bangladesh Final)లో పాకిస్థాన్-ఏ జట్టు బంగ్లాదేశ్-ఏ జట్టుపై గెలిచింది. సూపర్ ఓవర్ లో బంగ్లాను బోల్తా కొట్టించిన పాక్.. టైటిల్ విన్నర్ గా నిలిచింది. పాకిస్థాన్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టైటిల్‌ను గెలవడం ఇది మూడోసారి. పాకిస్థాన్-ఏ జట్టు టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత ఏసీసీ ఛైర్మన్ నఖ్వీ ట్రోఫీని పాక్ కెప్టెన్ ఇర్ఫాన్ ఖాన్ నియాజీకు అందజేశాడు. దీంతో అతడిపై టీమిండియా క్రికెట్ అభిమానులతో పాటు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పాకిస్థాన్(Pakistan Winner) విజేతగా నిలిస్తే.. ట్రోఫీ అందజేసినప్పుడు, భారత్ గెలిచిన ఆసియాకప్ 2025 ట్రోఫీని ఇవ్వడానికి ఏం రోగం అంటూ సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు.
మరోవైపు ఈ టోర్నమెంట్ చరిత్రలో తమ తొలి టైటిల్‌ను గెలవాలని లక్ష్యంగా చేసుకున్న బంగ్లాదేశ్ విఫలమైంది. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 ఫైనల్ మ్యాచ్ అనంతరం కెమెరాలు అన్నీ నఖ్వీ వైపు ప్రత్యేకంగా చూపించాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఓడించిన తర్వాత 2025 ఆసియా కప్(Asia Cup 2025) ట్రోఫీని భారత్ కు అప్పగించడానికి మోహ్సిన్ నఖ్వీ నిరాకరించారించిన సంగతి తెలిసిందే. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు వైస్ చైర్మన్ ట్రోఫీని ప్రదానం చేయాలని భారత్ కోరినప్పటికీ, నఖ్వీ(Mohsin Naqvi) స్వయంగా తానే ట్రోఫీని ఇవ్వాలని పట్టుబట్టారు. టీమిండియా నిరాకరించడంతో, ట్రోఫీని ప్రదానం చేసే కార్యక్రమం అర్ధాంతరంగా ఆగిపోయింది.
ఇవీ చదవండి: