Pakistan Wins: ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ టైటిల్ విజేత పాకిస్థాన్
ABN , Publish Date - Nov 24 , 2025 | 08:35 AM
ఆసియాకప్ 2025 ఫైనల్ లో ఘోరంగా ఓడిన పాకిస్థాన్ జట్టుకు వారి దేశానికి చెందిన పాక్-ఏ జట్టు తాజాగా ఓ ఊరటను ఇచ్చింది. ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ టైటిల్ విన్నర్ గా పాకిస్థాన్ ఏ జట్టు నిలిచింది.
ఇంటర్నెట్ డెస్క్: ఏసీసీ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్(ACC Asia Cup Rising Stars 2025)టైటిల్‌ను పాకిస్థాన్- ఏ జట్టుకు గెలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్‌లో బంగ్లాదేశ్- ఏ జట్టుపై పాక్(Pakistan vs Bangladesh A ) సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. తొలుత ఇరు జట్లూ 125 పరుగులు చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ఆరు పరుగులు చేయగలిగింది. అనంతరం నాలుగు బంతుల్లోనే 7 పరుగులు చేసిన పాకిస్థాన్ ఛాంపియన్‌గా నిలిచింది.
టాస్ గెలిచిన బంగ్లాదేశ్(Bangladesh) బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ కు తొలి బంతికే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ యాసిర్ ఖాన్ డకౌట్ కాగా.. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన మహ్మద్ ఫైక్ కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. కష్టాల్లో ఉన్న పాక్ ను మాజ్ సదాకత్ (23), అరాఫత్ మిన్హాస్ (25), సాద్ మసూద్ (38) ఆదుకున్నారు. ఈ ముగ్గురు రాణించంతో పాకి 125 పరుగులు చేయగలిగింది. ఇక బంగ్లా బౌలర్లలో రిపన్ 3 వికెట్లు తీసి.. పాక్(Pakistan) తక్కువ స్కోర్ కే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అలానే రకిబుల్ 2, మెహరోబ్, జిషన్, గఫార్ తలో వికెట్ పడగొట్టారు.
పోరాడిన బంగ్లా
125 పరుగుల టార్గెట్‌తో బంగ్లాదేశ్ బ్యాటింగ్(Bangladesh Batting) కు దిగింది. ఈ జట్టు కూడా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి.. 125 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయింది. ఓపెనర్ హబిబుర్ రహ్మాన్ సోహాన్ (26), రకిబుల్ హసన్ (24), మెహరోబ్ (19)తోపాటు చివర్లో టెయిలెండర్లు అబ్దుల్ గఫార్ (16*), రిపన్ మోండల్ (11*) రాణించారు. అబ్దుల్, రిపన్ లు చివరి వికెట్‌కు 29 పరుగులు జోడించి బంగ్లా విజయంపై ఆశలు లేపారు.
అయితే, పాక్ చివరి ఓవర్‌లో కాస్త కట్టుదిట్టంగా బాల్స్ వేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళ్లింది. పాక్ బౌలర్లలో సుఫియాన్ ముఖిమ్ 3 సాధించాడు. అహ్మద్ డానియల్ 2, అరాఫత్ మిన్హాస్ 2 వికెట్లు పడగొట్టారు. సాద్ మసూద్, మాజ్ సదాకత్ చెరో వికెట్ తీశారు. ఏసీసీ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టైటిల్ ను ఎక్కువ సార్లు పాకిస్థానే కైవసం చేసుకుంది. పాకిస్తాన్ 3 టైటిళ్ల(Pakistan Asia Cup Victory)తో (2019, 2023, 2025) అగ్రస్థానంలో ఉంది. శ్రీలంక 2017, 2018లో రెండుసార్లు ట్రోఫీని అందుకుంది. ఇండియా ఒకసారి (2013) మాత్రమే టైటిల్ గెలుచుకుంది.
ఇవీ చదవండి: