Home » Siddipet
హుస్నాబాద్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని.. ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని తెలిపారు.
సిద్దిపేటలో అడ్వాన్స్ టెక్నాలజీతో స్కిల్ డెవలప్‌మెంట్‌ని ప్రారంభిస్తామని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కంకణం కట్టుకుందని వివేక్ వెంకటస్వామి అన్నారు.
కాంగ్రెస్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్దామని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. వచ్చే ఎన్నికలనూ దృష్టిలో పెట్టుకొని గ్రామ గ్రామాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళ్తామని తెలిపారు.
Harish Slams Uttam: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలలో ముఖ్యమంత్రి రేవంత్‌ను ఉత్తమ్ మించిపోయారని వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ కుమార్ ఏది మాట్లాడినా అబద్దమే అని అన్నారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిఽధిలోని బెజుగామలోని రాయరావు చెరువులో వేర్వేరు కాలాలకు చెందిన 24వ జైన తీర్థంకరుడైన వర్థమాన మహావీరుని రెండు శిల్పాలను తెలంగాణ చరిత్రకారుడు కొలిపాక శ్రీనివాస్ గుర్తించారు.
తీవ్ర అస్వస్థతకు గురైన రెండేళ్ల బాలికను ఆస్పత్రికి తీసుకెళితే.. ‘‘చచ్చేవాళ్లకు సిరప్ ఎందుకు?’’ అని అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఆ వైద్యుడు. సిద్దిపేట జిల్లా చేర్యాల ప్రభుత్వాస్పత్రిలో ఈ ఘటన జరిగింది.
ఉద్దేశపూర్వకంగా కొంతమంది హిందువుల మీద భౌతిక దాడులు చేస్తే ఊరుకునేది లేదని ఎంపీ రఘునందన్ రావు హెచ్చరించారు. ఎంతసేపు మర్యాదగా ఉన్నప్పటికీ కావాలని కవ్వింపు చర్యలకు పాల్పడటం సరికాదని ఎంపీ రఘునందన్ రావు అన్నారు.
రైతులకు తమ ప్రభుత్వంలో పెట్టుబడి సాయం పెంచామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. దేశంలో ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని ఉద్ఘాటించారు.
తల్లిదండ్రులు తనకు బీఎండబ్ల్యూ కారు కొనివ్వడం లేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో జరిగింది.
BRS: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కనకయ్య కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చామని, ఇచ్చిన మాట ప్రకారం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి ఐదు లక్షల రూపాయల చెక్కును అందజేశామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు.