Share News

Siddipet: జీబీఎస్‌తో సిద్దిపేట మహిళ మృతి

ABN , Publish Date - Feb 10 , 2025 | 05:09 AM

సిద్దిపేట జిల్లా సీతారాంపల్లికి చెందిన గృహిణి (25)కి మూడోసారి గర్భం దాల్చడంతో... ప్రసవం కోసం సమీపగ్రామమైన లక్ష్మీదేవిపల్లిలోని తన పుట్టింటికి వెళ్లింది. అక్కడ ఒక నర్సింగ్‌హోమ్‌లో డిసెంబరు 5న ఆమె ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది.

Siddipet: జీబీఎస్‌తో సిద్దిపేట మహిళ మృతి

  • జనవరిలో గులియన్‌ బారీ సిండ్రోమ్‌ బారిన

  • తొలుత సిద్దిపేటలో చికిత్సచేసిన వైద్యులు

  • మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు!

  • 12రోజులు చికిత్స పొందుతూ కన్నుమూత

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): గులియన్‌ బారీ సిండ్రోమ్‌(జీబీఎస్‌) బారిన పడి.. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న సిద్దిపేట మహిళ శనివారం మృతి చెందింది. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో పన్నెండు రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె మృత్యువుతో పోరాడి కన్నుమూసింది. ఆమెను బతికించుకోవడానికి కుటుంబ సభ్యుల చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సిద్దిపేట జిల్లా సీతారాంపల్లికి చెందిన గృహిణి (25)కి మూడోసారి గర్భం దాల్చడంతో... ప్రసవం కోసం సమీపగ్రామమైన లక్ష్మీదేవిపల్లిలోని తన పుట్టింటికి వెళ్లింది. అక్కడ ఒక నర్సింగ్‌హోమ్‌లో డిసెంబరు 5న ఆమె ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత కొద్దిరోజులకు.. ఆమె కాళ్లల్లో తిమ్మిర్లు మొదలయ్యాయి.


తీవ్ర జ్వరంతో బాధపడుతుండడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఏ చికిత్స చేసినా ఉపయోగం లేకపోయింది. ఆమె కాళ్లు, చేతులు పనిచేయడం మానేశాయి. నడవలేక.. ఒంట్లో సత్తువ లేక.. తీవ్రంగా ఇబ్బందిపడుతున్న ఆమెను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేశారు. అయినా ఉపయోగం లేకపోవడంతో ఇతర ప్రైవేటు ఆస్పత్రులకు తరలించినా.. పరిస్థితి మెరుగుపడలేదు. చివరకు నిమ్స్‌కు తీసుకెళ్లారు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోవడంతో ఆమె శనివారం చనిపోయింది.

Updated Date - Feb 10 , 2025 | 05:09 AM