KCR: తాత కేసీఆర్‌తో కలిసి.. హిమాన్షు పొలం పనులు
ABN , Publish Date - Jan 17 , 2025 | 03:22 AM
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలోమాజీ సీఎం కేసీఆర్‌తో కలిసి ఆయన మనవడు హిమాన్షురావు పొలం పనులు చేశారు.

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలోమాజీ సీఎం కేసీఆర్‌తో కలిసి ఆయన మనవడు హిమాన్షురావు పొలం పనులు చేశారు. తాత కేసీఆర్ సూచనలతో తానే మట్టి తీసి.. ఓ మొక్కను నాటారు. ఆ వీడియోను తన ఎక్స్ ఖాతాలో హిమాన్షు పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ‘ఉత్తముల నుంచి నేర్చుకోవడం’ అని ఎక్స్‌లో రాసుకొచ్చారు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి అడవుల పెంపకం చాలా అవసరం అని, సహజ వనరులను రక్షించడం, సంరక్షించడం మన బాధ్యత అని హిమాన్షు పేర్కొన్నారు.
- ఆంధ్రజ్యోతి, హైదరాబాద్/మర్కుక్