కొమురవెల్లి మల్లన్న ఆలయం.. బండారుమయం!
ABN , Publish Date - Jan 21 , 2025 | 05:35 AM
కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్ యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లన్నకు పట్నంవారం పెద్దపట్నం, అగ్నిగుండాలను ఘనంగా నిర్వహించారు.
చేర్యాల, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం హైదరాబాద్ యాదవ సంఘం ఆధ్వర్యంలో మల్లన్నకు పట్నంవారం పెద్దపట్నం, అగ్నిగుండాలను ఘనంగా నిర్వహించారు. దేవదేవుడి ఆవాహనంతో మైమరిచిన శివసత్తులు, పోతరాజులు, భక్తులు పెద్దపట్నం ఎక్కి అగ్నిగుండాలు దాటారు. పట్నం రచించిన అనంతరం పోలీసుల బందోబస్తు నడుమ ఆలయ అర్చకులు గర్భాలయం నుండి ఉత్సవ విగ్రహాలను తీసుకువచ్చి ఆవాహనం చేశారు. పసుపుతో ఆలయ పరిసరాలన్నీ బండారుమయమయ్యాయి.