Home » Siddaramaiah
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకోనుండటం, రొటేషనల్ పద్ధతిలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు పదోన్నత కల్పించనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో మంత్రివర్గ పునర్వస్థీకరణ చోటుచేసుకోనుంది.
కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ మార్పులు జరుగనున్నాయని, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతారంటూ కొద్దికాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సిద్ధరామయ్య ప్రభుత్వం వచ్చే నవంబర్‌లో రెండున్నరేళ్లు పాలన పూర్తి చేసుకోనుంది.
కొద్ది రోజులుగా బెంగళూరు రోడ్ల పరిస్థితిపై కిరణ్ మజుందార్, డీకే శివకుమార్ మధ్య మాటల యుద్ధం సాగుతూ వచ్చింది. బెంగళూరు రోడ్లు, చెత్తతో తాను ఇబ్బందులు పడినట్టు ఒక విదేశీ విజిటర్ చేసిన వ్యాఖ్యలపై మజుందార్ స్పందించడం చర్చనీయాంశమైంది.
ప్రధాన అంశాల నుంచి దారి మళ్లించేందుకు బీజేపీ వ్యక్తిగత దాడులకు పాల్పడుతోందని ప్రియాంక్ ఖర్గే ఆరోపించారు. తనను వ్యక్తిగతంగా నిందించడానికి బదులు ఆర్ఎస్ఎస్ తరఫున ఎందుకు మాట్లాతున్నారో బీజేపీ సమాధానం చెప్పాలన్నారు.
కర్ణాటక వెనుకబడి తరగతుల కమిషన్ చేపట్టిన 'సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ సర్వే'లో పాల్గొన రాదని నారాయణ మూర్తి దంపతులు నిర్ణయం తీసుకున్నారు. ఎన్యూమరేషన్ కోసం ఆ దంపతుల ఇంటికి వెళ్లినప్పుడు తమకు సర్వే అక్కర్లేదని చెప్పినట్టు అధికారులు తెలిపారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 2023లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నాయకత్వ సమస్య పార్టీని ఇరకాటంలో పెడుతూనే ఉంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కూడా సిద్ధరామయ్య-డీకే శివకుమార్‌ల మధ్య చెరో రెండున్నరేళ్లు పాలన చేపట్టేందుకు రహస్య ఒప్పందం కుదిరిందనే ఊహాగానాలు వెలువడ్డాయి.
విప్రో క్యాంపస్ మీదుగా ట్రాఫిక్ అనుమతించాలన్న అభ్యర్థనను సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీ తిరస్కరించారు. క్యాంపస్‌లో అంతర్జాతీయ క్లైంట్స్‌కు సేవలందిస్తుంటామని తెలిపారు.
ఈ ఏడాది మైసూరు దసరా ఉత్సవాల ప్రారంభానికి అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ విజేత బాను ముస్తాక్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించడంతో వివాదం తలెత్తింది. ఆమె గతంలో హిందూ వ్యతిరేక, కన్నడ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని బీజేపీ అభ్యంతరం పెట్టింది
ప్రజల్ని మతం మారమని ఏ రాజకీయ పార్టీ కోరదని, అయినప్పటికీ మతమార్పిడులు జరుగుతున్నాయని, అది వారి హక్కు అని సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఇస్లాం, క్రైస్తవం, ఇతర ఏ మతాల్లోనైనా అసమానత్వం ఉండొచ్చన్నారు. కానీ..
కర్ణాటకలోని 7 కోట్ల ప్రజానీకం సామాజిక, విదాస్థితిని ఈ సర్వే తెలయజేయనుందని మీడియాతో మాట్లాడుతూ సీఎం సిద్ధరామయ్య తెలిపారు. ఇందుకోసం 1,75,000 మంది టీచర్లు పనిచేస్తారని, ఒక్కొక్కరికి రూ.20,000 వరకూ పారితోషిక అందుతుందని తెప్పారు.