Home » Secundrabad
సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య నడుస్తున్న వందేభారత్ రైళ్లకు అదనపు స్టాపేజీల సదుపాయాన్ని మరో ఆరునెలల పాటు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే 20707/20708 వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు ఫిబ్రవరిలో ప్రారంభించిన అదనపు స్టాపేజీ (ఏలూరు) సదుపాయం ఆగస్టులో ముగియనుందని సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు.
ప్రయాణికుల డిమాండ్ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి 16 ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25 నుంచి ఆగస్టు 15 వరకు (ప్రతి శుక్రవారం) ఎర్నాకుళం- పాట్నా(06085) మార్గంలో నాలుగు రైళ్లు, ఈనెల 28నుంచి ఆగస్టు 18 వరకు(ప్రతి సోమవారం) పాట్నా-ఎర్నాకుళం (06086) మధ్యలో నాలుగు రైళ్లు నడుస్తాయని తెలిపారు.
వివిధ మార్గాల్లో నడిచే 54 ప్రత్యేక రైళ్లను అక్టోబరు 15 వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-మధురై మార్గంలో 07191/07192 ప్రత్యేకరైళ్లు, హైదరాబాద్-కొల్లాం మార్గంలో 07193/07194, హైదరాబాద్-కన్యాకుమారి మార్గంలో 07230/07239 ప్రత్యేకరైళ్లను పొడిగించినట్లు సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు.
ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి ఆలయాన్ని అధికారులు సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి కీర్తనలతో గుడి పరిసరాలు హోరెత్తుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తొలి బోనం సమర్పించారు.
రోజ్గార్ మేళా సందర్భంగా శనివారం సికింద్రాబాద్ బోయిగూడ రైల్ కళారంగ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి
దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) గత మూడేళ్లలో పలు సవాళ్లను విజయవంతంగా అధిగమించి గణనీయ ఆర్థిక ప్రగతి సాధించింది.
ప్రయాణికుల డిమాండ్ మేరకు చర్లపల్లి - రామేశ్వరం, హైదరాబాద్ - కొల్లంల మధ్య 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు.
రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు నడుపుతున్న 37 ఎక్స్ప్రెస్ రైళ్ల వేళలు మార్పుచేసినట్లు దక్షిణ రైల్వేశాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ నుండి జూన్ 16,19,23, 26,30 తేదీల్లో మధ్యాహ్నం 2.05 గంటలకు బయలుదేరే పినాకిని ఎక్స్ప్రెస్ (నెం:12712) 20 నిమిషాలు ఆలస్యంగా బయలుదేరుతుంది.
నలుగురు హిజ్రాలను పోలీసులు అరెస్టు చేశారు. రైళ్లలో ప్రయాణికులను బెదిరించి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తుంటారు. అంతేగాక అసభ్యకర మాటలు అంటుంటారు. ఇది తీవ్ర ఇబ్బందికరంగా మారుతోంది. ముఖ్యంగా మహిళా ప్రయాణికుల పరిస్థితి అయితే చెప్పనలవిగాకుండా ఉంటోంది. పలువురి నుంచి వస్తున్న ఫిర్యాదులతో రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు నలుగురు హిజ్రాలను అరెస్టు చేశారు.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి నుంచి తిరుపతికి మరో 8 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మే 8 నుంచి ఈ రైళ్లు నడుస్తాయని, అలాగే ఈ ప్రత్యేక రైళ్లు నిర్ణిత స్టేషన్లలో మాత్రమే ఆగుతాయని రైల్వేశాఖ తెలిపింది.