Home » Secundrabad
కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ (20703/04) ఎక్స్‌ప్రెస్‌కు మెయింటెనెన్స్ హాలీడే (ప్రస్తుతం అమల్లో ఉన్న) బుధవారమే ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది.
ముజఫర్‌పూర్-హైదరాబాద్ (చర్లపల్లి) మార్గంలో కొత్తగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వేశాఖ ప్రవేశ పెట్టింది. ఆరంభ స్పెషల్(05253)ను రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు.
సికింద్రాబాద్-త్రివేండ్రం మధ్య నడుస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్ మంగళవారం నుంచి సూపర్ ఫాస్ట్ రైలుగా మారనుంది. ప్రస్తుతం 17229/30 నంబర్లతో నడుస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్ ఇకనుంచి 20629/30 నంబర్లతో పరుగులు పెట్టనుంది.
గంజాయి సరుకుతో రైల్లో ఢిల్లీకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఇద్దరిని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొకరు పరారీలో ఉన్నారు. గురువారం సికింద్రా బాద్ జీఆర్‌పీ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను రైల్వే డీఎస్పీ జావెద్, ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్‌గౌడ్‌తో కలిసి వెల్లడించారు.
రానున్న దసరా, దీపావళి, ఛట్‌ల పండగల దృష్ట్యా ప్రయాణికుల కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక రైళ్లను నడపడానికి దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రద్దీ నెలకొన్న దృష్ట్యా కొన్ని రైళ్లను సనత్‌నగర్-అమ్ముగూడ-మౌలాలీ-చర్లపల్లి మీదుగా మళ్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో విద్యుద్దీకరణ పనులు వందశాతం పూర్తి చేశామని జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాత్సవ తెలిపారు. బుధవారం నిర్వహించిన జోనల్ రైల్వే వినియోగదారుల సంప్రదింపుల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రయాణికుల రద్దీ, దసరా, దీపావళి పండుగలను పురస్కరించుకుని ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపనున్నట్టు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. చర్లపల్లి-తిరుపతి (07011) ప్రత్యేక వీక్లీ రైలు సెప్టెంబరు 5 నుంచి 26 వరకూ శుక్రవారాలలో, దీని తిరుగు ప్రయాణపు రైలు (07012) సెప్టెంబరు 6 నుంచి 27 వరకూ శనివారాలలో నడపనున్నట్లు తెలియజేశారు.
నగరం నుంచి హిందూపూర్ వెళ్లే ప్రయాణికులకు శుభావార్త చెప్పారు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి.సోమన్న. కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి యశ్వంత్‌పూర్‌కు వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు (20703) హిందూపూర్‌లో ఆగుతుందని(హాల్టింగ్) ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
సికింద్రాబాద్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ ఆక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో ప్రధాన నిందితురాలు, ఆ కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.
ఉత్తర భారత దేశంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి సెప్టెంబర్ 9న భారత గౌరవ్ టూరిస్ట్ రైలు యాత్ర నిర్వహిస్తున్నట్లు ఇండియన్ రైల్వే సౌత్ స్టార్ రైల్ అండ్ టూర్ టైమ్స్ డైరెక్టర్ విగ్నేష్ తెలిపారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో రైలుయాత్ర వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.