Share News

Shabari Express: శబరి ఎక్స్‌ప్రెస్‌.. ఇకపై సూపర్‌ ఫాస్ట్‌

ABN , Publish Date - Sep 30 , 2025 | 08:34 AM

సికింద్రాబాద్‌-త్రివేండ్రం మధ్య నడుస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్‌ మంగళవారం నుంచి సూపర్‌ ఫాస్ట్‌ రైలుగా మారనుంది. ప్రస్తుతం 17229/30 నంబర్లతో నడుస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్‌ ఇకనుంచి 20629/30 నంబర్లతో పరుగులు పెట్టనుంది.

Shabari Express: శబరి ఎక్స్‌ప్రెస్‌.. ఇకపై సూపర్‌ ఫాస్ట్‌

- నేటినుంచి మారనున్న రైలు నంబర్లు

- నగరం నుంచి త్రివేండ్రంకు 2 గంటల ప్రయాణ సమయం ఆదా

హైదరాబాద్‌ సిటీ: సికింద్రాబాద్‌-త్రివేండ్రం(Secunderabad-Trivandrum) మధ్య నడుస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్‌(Shabari Express) మంగళవారం నుంచి సూపర్‌ ఫాస్ట్‌ రైలుగా మారనుంది. ప్రస్తుతం 17229/30 నంబర్లతో నడుస్తున్న శబరి ఎక్స్‌ప్రెస్‌ ఇకనుంచి 20629/30 నంబర్లతో పరుగులు పెట్టనుంది. గతంతో పోల్చుకుంటే రైలు వేగం పెరగడంతో ఆ రైళ్లలో ప్రయాణించే వారికి సుమారు 2గంటల ప్రయాణ సమయం ఆదా కానుంది. నిన్న, మొన్నటివరకు సికింద్రాబాద్‌ నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం 12.20గంటలకు బయల్దేరే శబరి ఎక్స్‌ప్రెస్‌ మరుసటి సాయంత్రం 6.05గంటలకు త్రివేండ్రం చేరుకునేది.


తాజాగా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‏(Superfast Express)గా మారాక ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 6.25 గంటలకు చేరనుంది. ఇంతకుముందు త్రివేండ్రంలో ఉదయం 6.45గంటలకు బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.45గంటలకు సికింద్రాబాద్‌ వచ్చే శబరి ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ఫాస్ట్ గా మారాక త్రివేండ్రంలో ఉదయం 6.45 గంటలకు బయల్దేరి సికింద్రాబాద్‌కు ఉదయం 11 గంటలకు చేరనుంది.


city3.2.jpg

ప్రయాణికులపై చార్జీల భారం

శబరి ఎక్స్‌ప్రెస్‌ సూపర్‌ ఫాస్ట్‌ కావడంతో ప్రయాణ సమయం 2గంటలు ఆదా అవుతుందని ఆనందపడుతున్న ప్రయాణికులు సూపర్‌ ఫాస్ట్‌ చార్జీల రూపేణా జనరల్‌ సెకండ్‌ క్లాస్‌ టికెట్‌కు రూ.15, స్లీపర్‌, ఏసీ తరగతుల టికెట్లపై రూ.30నుంచి 40వరకు అదనంగా చెల్లించాల్సి రావడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు దక్షిణమధ్యరైల్వే ఆధ్వర్యంలో ఉండే శబరి ఎక్స్‌ప్రెస్‌ నిర్వహణ (మెయింటెనెన్స్‌) బాధ్యతలను నేటినుంచి సదరన్‌ రైల్వే చేపట్టనుందని రైల్వే ఉన్నతాధికారులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

నైరుతిలో సాధారణ వర్షపాతమే

Read Latest Telangana News and National News

Updated Date - Sep 30 , 2025 | 08:41 AM