Home » Saudi Arabia
సౌదీ అరేబియాలో ఒక హైదరాబాదీ మహిళ దారుణానికి ఒడిగట్టింది. తన ముగ్గురు చిన్నారులను చంపి ఆపై ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది.
సౌదీ అరేబియాలో ఒక హైదరాబాదీ మహిళ దారుణానికి పాల్పడింది. తన ముగ్గురు చిన్నారులను చంపి తాను కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. సౌదీ అరేబియాలోని అల్ ఖోబర్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సౌదీ అరేబియా ఆదివారం ఒక్కరోజే నేరం రుజువైన ఎనిమిది మంది ఖైదీలకు ఉరిశిక్షను అమలు చేసింది..
గత 20 ఏళ్లుగా కోమాలో ఉన్న సౌదీ యువరాజు అల్ వలీద్ బిన్ 36 కన్నుమూశారు.
ఇరవై ఏళ్లుగా కోమాలో ఉన్న సౌదీ రాకుమారుడు అల్ వాలిద్ బిన్ ఖలీద్ బిన్ తలాల్ అల్ సౌద్ ఇటీవల కన్నుమూశారు. ఆయన వయసు 35 ఏళ్లు. 15 ఏళ్ల వయసులో జరిగిన ఓ కారు ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిపోయారు. ఆయన మృతిపై సౌదీ రాజకుటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది.
భారత్‌లో ఎరువుల సరఫరా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. వచ్చే సంవత్సరానికి 31 లక్షల మెట్రిక్ టన్నుల డి.ఎ.పిని దిగుమతి చేసుకునేందుకు సౌదీ అరేబియాతో ఒప్పందం కుదుర్చుకుంది. సౌదీ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి జేపీ నడ్డా సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది.
ఖరీఫ్ సీజన్‌లో ఏర్పడిన కొరతను తీర్చేందుకు సౌదీ అరేబియా.. భారత్‌కు ఎరువులు సరఫరా చేయనుంది...
సౌదీ అరేబియాలో పనికి వెళ్లి చిత్రహింసకు గురైన నెల్లూరు కుల్లూరు గ్రామానికి చెందిన షేక్ నజీర్ బాధితుడిని భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో ఏపికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేపట్టాయి. కేంద్ర విదేశాంగ శాఖ, భారత ఎంబసీ సమన్వయంతో నజీర్ విముక్తి పొందాడు.
ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పునర్నిర్మాణం ప్రారంభం అయిన సందర్భంగా సౌదీ అరేబియాలో ప్రవాసాంధ్రులు సంబరాలు జరిపారు. రియాధ్‌లో శనివారం నిర్వహించిన సంబరాల్లో టీడీపీ నేత జానీ బాషా ఆధ్వర్యం సాగింది
ప్రధాని మోదీ సౌదీ అరేబియా పర్యటనలో బాపట్ల మహిళ దుర్గాభవానీతో మాట్లాడారు. "మీరు ప్రధాని అయ్యినందుకు సంతోషంగా ఉంది" అన్న ఆమెకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు