Share News

Gulf News: సౌదీలో దారుణం.. ముగ్గురు చిన్నారులను చంపేసిన హైదరాబాదీ తల్లి..

ABN , Publish Date - Aug 27 , 2025 | 05:33 PM

సౌదీ అరేబియాలో ఒక హైదరాబాదీ మహిళ దారుణానికి పాల్పడింది. తన ముగ్గురు చిన్నారులను చంపి తాను కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. సౌదీ అరేబియాలోని అల్ ఖోబర్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Gulf News: సౌదీలో దారుణం.. ముగ్గురు చిన్నారులను చంపేసిన హైదరాబాదీ తల్లి..
Hyderabadi mother kills sons

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సౌదీ అరేబియాలో ఒక హైదరాబాదీ మహిళ దారుణానికి పాల్పడింది. తన ముగ్గురు చిన్నారులను చంపి తాను కూడా ఆత్మహత్య యత్నానికి పాల్పడింది (mother kills children). సౌదీ అరేబియాలోని అల్ ఖోబర్ నగరంలో హైదరాబాద్ నగరం టోలీచౌకీకు చెందిన సయ్యద హుమేరా ఆమ్రీన్ (33) అనే మహిళ తన భర్త, ముగ్గురు పిల్లలతో కలిసి నివసిస్తోంది (Hyderabadi mother kills sons).


ఆమ్రీన్ మంగళవారం తన కొడుకులు సాదిఖ్ అహ్మద్ (7), అదిల్ అహ్మద్ (7), యూసుఫ్ అహ్మద్ (3)ను కిరాతకంగా చంపేసింది. తన ఇంట్లోని స్నానపుగదిలోని బాత్ టబ్‌లో ముంచి ముగ్గురినీ చంపేసింది. అతర్వాత తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. భర్త మహమ్మద్ షాహానవాజ్ సాయంత్రం ఆరుగంటలకు ఇంటికి వచ్చి ఘటన గురించి పోలీసులకు సమాచారమందించారు (Gulf tragic news).


పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు (shocking news Saudi Arabia). తన భార్య మానసిక స్ధితి సరిగ్గా లేదని మహమ్మద్ చెబుతున్నాడు. అయితే కుటుంబ కలహాలు కారణంగానే తాను ఇలా చేసినట్టు భార్య పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

న్యూయార్క్ రోడ్డు ప్రమాదం.. మృతుల్లో భారతీయుడు ఉన్నట్టు పోలీసుల వెల్లడి

ఓపీటీని ట్రంప్ టార్గెట్ చేయనున్నారా.. విదేశీ విద్యార్థులకు చుక్కలే..

Read Latest and NRI News

Updated Date - Aug 27 , 2025 | 07:43 PM