Saudi Arabia: ముగ్గురు పిల్లలను చంపి ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Aug 29 , 2025 | 04:44 AM
సౌదీ అరేబియాలో ఒక హైదరాబాదీ మహిళ దారుణానికి ఒడిగట్టింది. తన ముగ్గురు చిన్నారులను చంపి ఆపై ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది.
సౌదీలో హైదరాబాదీ తల్లి దుశ్చర్య
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి): సౌదీ అరేబియాలో ఒక హైదరాబాదీ మహిళ దారుణానికి ఒడిగట్టింది. తన ముగ్గురు చిన్నారులను చంపి ఆపై ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. సౌదీ అరేబియాలోని అల్ ఖోబర్ నగరంలో హైదరాబాద్‌లోని టోలీచౌకీకి చెందిన సయ్యద్ హుమేరా ఆమ్రీన్ (33) కుమారులు సాదిఖ్ అహ్మద్(7), అదిల్ అహ్మద్(7), యూసుఫ్ అహ్మద్(3)తో ఉంటోంది.
మంగళవారం ఆమె తన ముగ్గురు పిల్లలను బాత్ టబ్‌లో ముంచి చంపేసింది. ఆ తర్వాత ఆమె కూడా ఆత్మహత్యాయత్నం చేసింది. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త మహ్మద్ షాహానవాజ్ ఇది చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. తన భార్య మానసిక స్థితి సరిగా లేదని ఆయన చెబుతున్నారు.