Share News

India on Pak-Saudi Pact: పాక్-సౌదీ ఒప్పందంతో కలిగే పర్యవసానాలను పరిశీలిస్తున్నాం: కేంద్ర ప్రభుత్వం

ABN , Publish Date - Sep 18 , 2025 | 10:57 AM

పాక్, సౌదీ అరేబియా మధ్య తాజాగా కుదిరిన వ్యూహాత్మక రక్షణ ఒప్పందం తాలూకు పర్యవసానాలను నిశితంగా గమనిస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి తాజాగా పేర్కొన్నారు. జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

India on Pak-Saudi Pact: పాక్-సౌదీ ఒప్పందంతో కలిగే పర్యవసానాలను పరిశీలిస్తున్నాం: కేంద్ర ప్రభుత్వం
India reaction Pakistan Saudi Defence Deal

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్, సౌదీ అరేబియా దేశాల మధ్య తాజాగా కుదిరిన సమగ్ర వ్యూహాత్మక రక్షణ ఒప్పందంపై భారత్ స్పందించింది. ఈ ఒప్పందం వల్ల కలిగే పర్యవసానాలను నిశితంగా పరిశీలిస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి తాజాగా పేర్కొన్నారు. పాక్, సౌదీల్లో ఏ ఒక్క దేశంపై దాడి జరిగినా ఇరువురిపై దాడిగా పరిగణించేలా ఈ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే (India reaction on Pak-Saudi defence deal).

తాజా పరిణామాలు తమ దృష్టికి వచ్చాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ తాజాగా పేర్కొన్నారు. అంతర్జాతీయ, ప్రాంతీయ సుస్థిరతలపై ఈ ఒప్పందం పర్యవసానాలను నిశితంగా పరిశీలిస్తున్నామని అన్నారు. దేశ ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని అన్నారు. అన్ని కోణాల్లో జాతీయ ప్రయోజనాలను కాపాడుకుంటామని తెలిపారు (Pakistan Saudi Arabia mutual defence pact).


స్ట్రాటజిక్ మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్ పేరిట ఇరు దేశాలు ఈ రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. పాక్ ప్రధాని షహబాస్ షరీఫ్ సౌదీ పర్యటన సందర్భంగా సౌదీ క్రౌన్స్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇటీవల హమాస్ నేతలను టార్గెట్ చేస్తూ ఖతర్‌పై ఇజ్రాయెల్ దాడి చేసిన నేపథ్యంలో సౌదీ, పాక్ మధ్య ఈ ఒప్పందం కుదరడం గమనార్హం. అయితే, ఈ దాడులను అమెరికా స్వయంగా తప్పుబట్టింది. అమెరికాతో పాటు ఇజ్రాయెల్ జాతీయ ప్రయోజనాలకు ఇది విఘాతమని పేర్కొంది. ఇక పహల్గాం దాడి తరువాత భారత్ పాక్ మధ్య ఘర్షణల నేపథ్యంలో ఈ ఒప్పందానికి ప్రాధాన్యం ఏర్పడింది. తమ దేశంపై జరిగే ఉగ్రదాడులను యుద్ధ చర్యలుగా పరిగణిస్తామని అప్పట్లో భారత్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

అమెరికాలో జిమ్మీ కిమ్మెల్ లైవ్ షో నిలిపివేత.. దేశానికి ఇది శుభవార్త అన్న ట్రంప్

అమెరికాలో కాల్పుల కలకలం.. ముగ్గురు పోలీసుల మృతి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయం

Updated Date - Sep 18 , 2025 | 10:59 AM