Home » Puttaparthy
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి అధికారులు బాఽధ్యయుతంగా పనిచేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ సునితాబయి అధ్యక్షతన సర్వసభ సమావేశం నిర్వహించారు.
నేరాలు చేసి జైలు జీవితం గడుపుతున్న వారు బయటికి వెళ్లాక సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ అన్నారు.
ఎంజీఎం పాఠశాల హెచఎం సామ్రాజ్యంపై గతంలో కొందరు చేసిన ఫిర్యాదులపై డీవైఈఓ పద్మప్రియ విచారణ అధికారిగా గురువారం పాఠశాలకు వచ్చారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్, విద్యాశాఖ మంత్రి పేషీ నుంచి డీఈఓకు ఆదేశాలు అందగా ఆయన డీవైఈఓకు బాధ్యతలు అప్పగించినట్లు ఆమె తెలిపారు.
మైమరపించే సోయగాలతో, చంకన అమృతభాండాగారంతో మోహన రూపుడైన శ్రీవారిని దర్శించుకోవడానికి వేలాది భక్తులు తరలిరాగా ఆలయ ప్రాంగణంతో పాటు తిరువీధులు సందడిగా మారాయి.
విద్యార్థి దశ నుంచే సమాజసేవ అలవర్చుకోవాలని ఆచార్య ఎనజీ రంగా వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల అసోసియేట్ డీన డాక్టర్ సరోజినీ దేవి అన్నారు.
సాంకేతిక పరిజ్ఞానంతోనే దేశాభివృద్ధి సాధ్యమని మున్సిపల్ చైర్మన డీఈ రమే్‌షకుమార్ అన్నారు. ఆదివారం పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల వార్షికోత్సవాన్ని నిర్వహించారు.
నగర పంచాయతీ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం అప్పటి సీఎం చంద్రబాబు రూ.66కోట్లు మంజూరు చేశారని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కమీషన్ల కోసం కక్కుర్తిపడి బుగ్గిపాలు చేశారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి విమర్శించారు.
మతసామరస్యానికి ప్రతీక పెనుకొండ అని హిందూ, ముస్లిం, జైన మతస్థులకు నిలయంగా వెలుగొందుతోందని మంత్రి సవిత అన్నారు. ఆదివారం స్థానిక పశ్చాపార్వ్శనాథస్వామి జైన ఆలయ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
వ్యవసాయంలో పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైతుల్లో సంతోషాన్ని నింపేందుకే ఎడ్లబండ్ల పోటీలు నిర్వహిస్తున్నట్లు శంకర్‌లాల్ నాయక్ తెలిపారు.
కనుమ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా సాగింది. రథోత్సవాన్ని వీక్షించడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.