BUSINESS: జోరుగా ఫుట్‌పాత వ్యాపారం
ABN , Publish Date - Nov 27 , 2025 | 11:38 PM
సత్యసాయి శతజయంతి వేడుకల్లో పాల్గొన్న భక్తుల కోసం పుట్టపర్తి పట్టణంలోని ఫుట్‌పాత మీద పలు దుకాణాలు వెలిశాయి. బెంగళూరు, చెన్నై ఇతర ప్రాంతాలకు చెం దిన వ్యాపారులు తాత్కాలికంగా పుట్‌పాతపై దుకాణాలు ఏర్పాటుచేసు కున్నారు. శత జయంతి వేడుకల కోసం వచ్చిన భక్తులు ఫుట్‌పాతఫై వెలసిన దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం సత్యసా యి జయంతి వేడుకల్లో ఫుట్‌పాత వ్యాపారులు వెలయడం ఆనవాయితీ గా వస్తోంది.
పుట్టపర్తి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): సత్యసాయి శతజయంతి వేడుకల్లో పాల్గొన్న భక్తుల కోసం పుట్టపర్తి పట్టణంలోని ఫుట్‌పాత మీద పలు దుకాణాలు వెలిశాయి. బెంగళూరు, చెన్నై ఇతర ప్రాంతాలకు చెం దిన వ్యాపారులు తాత్కాలికంగా పుట్‌పాతపై దుకాణాలు ఏర్పాటుచేసు కున్నారు. శత జయంతి వేడుకల కోసం వచ్చిన భక్తులు ఫుట్‌పాతఫై వెలసిన దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం సత్యసా యి జయంతి వేడుకల్లో ఫుట్‌పాత వ్యాపారం దుకాణాలు వెలయడం ఆనవాయితీ గా వస్తోంది. సదూర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకోవలసిన అవసరమైన వస్తువులు ఇక్కడే ఫుట్‌పాతఫై దొరకుతుండడంతో భక్తులు వాటిని కొనుగోలు చేస్తున్నారు. ఎక్కువగా ఫ్యాన్సీ, కాస్మొటిక్స్, చిన్నపిల్లల వస్తువులు, ఇంటికి అవసరమైన వంట సామాగ్రి వస్తువులతో పాటు బట్టలు తక్కువ ధరకే అన్నీ ఒకే ప్రాంతంలో దొరుకుతున్నాయి. దీంతో భక్తులు ఎగబడి వాటిని కొనుగోలు చేస్తున్నారు. తిరుగు ప్రయాణంలో పుట్టపర్తి నుంచి ఏమైనా గుర్తుగా తీసుకెళ్లాలని ఉత్సాహంతో కొనుగోలు చేస్తున్నట్లు పలువురు భక్తులు తెలుపుతున్నారు. దీంతో పుట్టపర్తిలో పుట్‌పాతపై వెలసిన దుకాణాల్లో వ్యాపారం బాగా సాగుతోంది.
అనంతపురం జిల్లా మరిన్ని వార్తల కోసం....