Home » Ponnam Prabhakar
Ponnam Prabhakar: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేటీఆర్ అసహనానికి పరాకాష్టగా మారారని ఆయన అభివర్ణించారు.
శనివారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మునిసిపాలిటీలో రూ.1.30కోట్లు, మహేశ్వరంలో రూ.1.65 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
Bandi Sanjay: కరీంనగర్లో నాలుగు వేల ఇండ్లకు నిరంతరాయంగా 24 గంటల పాటు నీళ్లు సరఫరా అవుతాయని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. పేదరికం నుంచి హర్యానా సీఎంగా, కేంద్రమంత్రిగా ఎదిగిన మనోహర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం ఎంతో గర్వకారణమన్నారు. కరీంనగర్లో డంప్ యార్డ్తో ప్రజలు అల్లాడిపోతున్నారని.. డంపింగ్ యార్డు సమస్య నుంచి కరీంనగర్ ప్రజలకు విముక్తి కల్పిస్తామన్నారు.
రూ.2 లక్షలకు పైగా రుణాలుండి ఇంకా మాఫీ అమలు కానీ రైతులకు మార్చిలో షెడ్యూల్ పెట్టి చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
యాదాద్రి: తెలంగాణ రాష్ట్రంలో అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వాలని చూస్తుంటే బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. పదేళ్లపాటు రేషన్ కార్డులు ఇవ్వలేని సిగ్గులేని నేతలు గ్రామసభలకు అడ్డుతగులుతున్నారని మంత్రి ఘాటుగా స్పందించారు.
నూతన రేషన్కార్డు కోసం, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు ఇప్పుడు కూడా వార్డు సభల్లో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్(In-charge Minister Ponnam Prabhakar) సూచించారు.
రాష్ట్రంలో పలు కొత్త బస్ డిపోలు, బస్ స్టేషన్లను నిర్మించడంతోపాటు ప్ర స్తుతం ఉన్న బస్ స్ట్టేషన్ల విస్తరణకు చర్యలు చేపట్టాలని ఆర్టీసీ బోర్డు నిర్ణయించింది. బస్ భవన్లో శనివారం ఆర్టీసీ బోర్డు సమావేశం జరిగింది.
minister Ponnam Prabhakar: కొత్త రేషన్ కార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు.
జనవరి 26 వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలిపారు. సిద్దిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సంక్రాంతి పండగకు ఈ సారి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంతో పోలిస్తే ఈ ఏడాది కొత్త ట్రెండ్ మొదలైనట్లు అంచనా వేస్తున్నారు.