Share News

Ponnam: కులగణనతో బీసీలకు సామాజిక న్యాయం

ABN , Publish Date - Feb 09 , 2025 | 03:19 AM

బీసీ కమిషన్‌, బీసీ సంఘాల ప్రతినిధులు, బీసీ మేధావులతో ప్రభుత్వ సలహాదారు కే కేశవురావుతో కలిసి శనివారం ఆయన సచివాలయంలో సమావేశమయ్యారు.

Ponnam: కులగణనతో బీసీలకు సామాజిక న్యాయం

  • బీసీ కమిషన్‌, సంఘాల ప్రతినిధులతో మంత్రి పొన్నం ప్రభాకర్‌

  • బీసీల సాధికారితపై వారి సూచనలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): కులగణన ద్వారా బీసీలకు సామాజిక న్యాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. బీసీ కమిషన్‌, బీసీ సంఘాల ప్రతినిధులు, బీసీ మేధావులతో ప్రభుత్వ సలహాదారు కే కేశవురావుతో కలిసి శనివారం ఆయన సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహించిన కులగణన సర్వేపై కొన్ని ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరాలు లేవనెత్తి సర్వేను తప్పుపడుతున్నందున వాస్తవ పరిస్థితి వివరించేందుకే ఈ సమావేశమని తెలిపారు. అనంతరం బీసీ సంఘాల ప్రతినిధులు లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేశారు. అలాగే, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సర్వే పూర్తిగా జరగలేదంటూ వచ్చిన ఫిర్యాదులను ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రి చెప్పారు.


ముఖ్యమంత్రి నేతృత్వంలో కులగణనను అత్యంత పారదర్శకంగా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ తప్పుడు విమర్శలు చేస్తున్నాయని పొన్నం పేర్కొన్నారు. కాగా, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశానికి చట్టబద్ధత కల్పించాలని, తమిళనాడు తరహా రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంఘాల ప్రతినిధులు ఈ సందర్భంగా మంత్రిని కోరారు. అలాగే, కులగణనలో జరిగిన పొరపాట్లను సరిచేసేందుకు, మిగిలిన సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటరు జాబితా కంటే తక్కువ జనాభా లెక్కలపై పరిశీలించి రీ-సర్వే చేయాలని కోరారు. బీసీల జనాభా త గ్గించిన పక్షంలో రిజర్వేషన్లపై ప్రభా వం ఉంటుందని, అస్పష్టతతో స్థానిక ఎన్నికలకు వెళితే బీసీల రిజర్వేషన్లకు విఘాతం క లిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకు స్పందించిన మంత్రి పొన్నం.. బీసీ డిక్లరేషన్‌ అ మలు, కులగణన అంశంలో బీసీ సంఘాల ప్రతినిధులు చేసిన సూచనలు, ప్రతిపాదనలు, లేవనెత్తిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి.. వాటిపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి

MLC Kavitha: కాంగ్రెస్‌ ఆరోపణల్లో నిజం లేదు.. కేసీఆర్ ఎంతో కష్టపడ్డారు

Nandamuri Balakrishna: నాన్న ఆశీర్వాదం వల్లే పద్మ భూషణ్: బాలకృష్ణ

Supreme Court: ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Feb 09 , 2025 | 03:19 AM