Home » Police case
వ్యసనాలకు, లగ్జరీ జీవితానికి అలవాటుపడిన కొందరు కిలేడీలు డబ్బులు సంపాదనకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. వలపు విసిరి సాయం ముసుగులో నిలువునా దోచేస్తున్నారు. ఇలాంటి వారిపై అప్రమత్తంగా ఉండాలని, ఒంటరి మహిళ అని సానుభూతి చూపిస్తే ఇబ్బందులు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Chetan Jewellers: కూకట్‌పల్లి ప్రగతినగర్‌లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రూ. 10 కోట్ల విలువైన బంగారంతో చేతన్ జువెల్లర్స్ యాజమాని నితీష్ జైన్ పరారయ్యాడు. కేపీహెచ్‌బీ, బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జైన్ తన వ్యాపారాన్ని నిర్వహించాడు.
Fraud Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు శ్రవణ్ రావును చీటింగ్ కేసులో అరెస్టు చేసిన సీసీఎస్ పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో ఏ4గా శ్రవణ్ రావు భార్య స్వాతి రావును చేర్చారు. ఆమెను కూడా సీసీఎస్ పోలీసులు విచారించనున్నారు.
Crime News: కూలి పనులు చేసుకుంటూ కేశవగిరిలో నివాసం ఉంటున్న కేతావత్ బుజ్జి అనే మహిళ.. భర్త చనిపోవడంతో.. ఒంటరిగా ఉంటోంది. వెస్ట్ బెంగాల్‌కు చెందిన మేస్త్రీ జుల్ఫికర్ అలీతో ఆమెకు అక్రమ సంబంధం ఏర్పడింది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి తేవడంతో హత్య చేశాడు.
లంచం కేసులో అరెస్టైన డీఎస్పీ పార్థసారథి ఇంట్లో ఏసీబీ తనిఖీల్లో అక్రమంగా మందుగుండు వస్తువులు వెలుగుచూశాయి. 21 లైవ్ రౌండ్లు, 69 ఖాళీ కాట్రిడ్జ్‌లపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు.
AP liquor scam: ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడు గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు అరెస్టు చేశారు. మూడు రోజుల క్రితం విచారణకు హాజరు కావాలని సిట్ అధికారులు నోటీసులు ఇవ్వగా విచారణకు హాజరుకాకుండా గైర్హాజరయ్యారు. ఎట్టకేలకు మైసూరులో గోవిందప్పను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
TGCSB: తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న 20 మందిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్‌బీ) అధికారులు అరెస్టు చేశారు. మే నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రెండు బృందాలు రెక్కీ నిర్వహించి వారిని అరెస్టు చేసినట్టు సీఎస్‌బీ డీజీ ప్రకటించారు.
Road Accident: ఓ వివాహ వేడుకకు వెళ్లి చౌతియా ఛత్తీ నుంచి రాయ్‌పూర్‌కు వస్తుండగా రోడ్దు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. 30 మందికిపైగా గాయపడ్డారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వైసీపీ హయాం నాటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) నియామకాల్లో జరిగిన అక్రమాలను విజయవాడ పోలీసులు వెలికితీస్తున్నానే. విచారణలో కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో మధుసూదన్‌ను పోలీసులు A-2గా చేర్చారు.
హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో నిర్వహిస్తున్న వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఏజెంట్, నిర్వాహకుడు నాయక్‌లను అరెస్టు చేశారు. ఇద్దరు విదేశీ యువతులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.