Harassment case: రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ ఆర్ఎస్ఐపై కేసు
ABN , Publish Date - May 17 , 2025 | 12:56 PM
Harassment case: మహిళను వేధిస్తుండటంతో రెడ్ శాండల్ టాస్క్‌ఫోర్స్ ఆర్ఎస్ఐ విశ్వనాథ్‌పై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. మూడేళ్లుగా వేధింపులకు గురిచేస్తూ... కాపురంలో గొడవలు పెడుతున్న విశ్వనాథ్‌పై చర్యలు తీసుకోవాలని ఓ వివాహిత ఆవేదన వ్యక్తం చేసింది.

తిరుపతి: రెడ్ శాండల్ టాస్క్ ఫోర్స్ (Red Sandalwood Task Force) ఆర్ఎస్ఐ విశ్వనాథ్ (RSI Vishwanath)పై అలిపిరి పోలీసులు (Alipiri police) కేసు (Case) నమోదు చేశారు. గత మూడేళ్లుగా వేధింపులకు గురిచేస్తూ... తన కాపురంలో గొడవలు పెడుతున్న విశ్వనాథ్‌పై చర్యలు తీసుకోవాలని టీటీడీ ఉద్యోగి భార్య ఫిర్యాదు (TTD employee Wife complaint) చేసింది. విశ్వనాథ్ చెప్పినట్లుగా వినకపోతే తన భర్తను చంపేస్తానని ఫోన్‌లో బెదిరింపులకు దిగాడని బాధితురాలు పేర్కొంది. జనవరిలో స్నేహితులతో కలసి తన భర్తపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో తెలిపింది. కాగా వేధింపులతో పాటు ఆర్ఎస్ఐపై అవినీతి ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆయనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఆర్ఎస్ఐపై అవినీతి ఆరోపణలు ఉన్నా.. ఉన్నతాధికారులు అతనిని రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్‌లోనే కొనసాగిస్తున్నారు.
Also Read: రెండేళ్లుగా పరారీ.. ముంబై ఎయిర్ పోర్టులో అరెస్టు
చిత్తూరు జిల్లాకు చెందిన వైసీపీ నేత, ఎర్రచందనం స్మగ్లర్ విజయానంద రెడ్డి అండదండలతో టాస్క్ పోర్స్‌లో విశ్వనాథ్ పొస్టు దక్కించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 2022లో తనను ఆర్ఎస్ఐ విశ్వనాథ్ వేధిస్తున్నాడని బాధితురాలు అలిపిరి పోలీసులకు పిర్యాదు చేసినా పట్టించుకోలేదని, పిర్యాదును బుట్టదాకలు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో విశ్వనాథ్ ఇంకా రెచ్చిపోయి మూడేళ్ళుగా తన కుటుంబాన్ని వేధిస్తున్నాడని ఆమె తెలిపింది. కాగా తన భార్య మోబైల్‌కు అసభ్యకరమైన వీడియోలు పంపిన ఆర్ఎస్ఐపై ఆమె భర్త తట్టుకోలేక.. ఆగ్రహం వ్యక్తం చేస్తూ విశ్వనాధ్‌కు దేహశుద్ది చేశాడు. మరోవైపు వివాహిత పిర్యాదు మేరకు ఈ నెల 9న అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసు నమోదు చేసి వారం రోజులు గడిచినా ఆర్ఎస్ఐపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు ఈ కేసులో రాజీకి రావాలని ఒత్తిడి చేస్తున్నట్టు సమాచారం.
ఈ వార్తలు కూడా చదవండి..
నకిలీ ఇళ్ల పట్టాల కేసు.. బెయిల్ కోసం వంశీ పిటిషన్
కార్ల పన్ను ఎగవేత కేసు.. మరో ఇద్దరిని విచారిస్తున్న డీఆర్ఐ
For More AP News and Telugu News