Home » Police case
Kakani: గత ప్రభుత్వ హయాంలో తన నియోజకవర్గంలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే మార్గంలో అనధికారంగా కాకాణి టోల్‌గేట్‌ను ఏర్పాటు చేసి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. దీనిపై కాకాణీని విచారించనున్నారు.
Robbery Attempt: విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో కొందరు దుండగులు చోరీకి యత్నించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో దుండగులు రైల్లో నుంచి దూకి పారిపోయారు.
Crime News: సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో నిందితుడు తిరుమలరావుతో సహా కీలక సూత్రధారులు అందరినీ అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. తేజేశ్వర్, ఐశ్వర్య పెళ్లికి ముందు నుంచే తేజేశ్వర్‌ను అంతమొందించాలని తిరుమలరావు పన్నాగం చేశారన్నారు.
జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ఈ నెల 18న గుంటూరు నగర శివారు ఏటుకూరు బైపాస్ రోడ్డు వద్ద జగన్ కారు ఢీకొని తొక్కుకుంటూ పోయిన ఘటనలో వైసీపీ దళిత కార్యకర్త సింగయ్య మరణించడానికి మాజీ సీఎం జగన్ సహా ఆరుగురు కారణమని పోలీసులు ప్రకటించారు.
Hyderabad.. నగరంలోని కుత్బుల్లాపూర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ ఇంట్లో గంజాయి అమ్ముతున్నారని సమాచారం అందుకున్న బాలనగర్ జోన్ ఎస్‌వోటీ పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్లి.. తనిఖీలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ కానిస్టేబుల్ నిల్చున్న చోటే కుప్పకూలారు...
kadapa Dist: పులివెందులలో సంచలన సంఘటన చోటు చేసుకుంది. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఏ2 నిందితుడు సునీల్ కుమార్ యాదవ్‌ను కొంతమంది వెంబడించారు. దీంతో ఆందోళన చెందిన సునీల్.. తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటన సందర్భంగా వాహనం ఢీకొని సింగయ్య అనే కార్యకర్త మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. తాజా వీడియోల్లో ఆసక్తికర విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది.
YCP leaders cases: వైఎస్ జగన్ పల్నాడు జిల్లా, సత్తెపల్లి పర్యటనలో వైసీపీ అరాచకం అడుగడుగునా కనిపించింది. నిబంధనలు ఉల్లంఘించారు. అనుమతులు లేకుండా ర్యాలీ, డీజే నిర్వహించారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. విధ్వంసం, బెదిరింపులు, ఇరువురు వ్యక్తుల మరణంపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
AP liquor scam: ఏపీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏసీబీ న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. ఆ సమయంలో చెవిరెడ్డి హంగామా చేశారు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మంగళవారం మరోసారి సిట్ విచారణకు రానున్నారు. ఇప్పటికే మూడుసార్లు ఆయనను అధికారులు విచారించారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. దీనికి సంబంధించి..