Pakistani Fahad : పాకిస్థానీ ఫహద్ కు రిమాండ్.. ఎంత మందిని ప్రేమ పెళ్లి పేరుతో మోసం చేశాడనే ఆరా
ABN , Publish Date - Aug 16 , 2025 | 02:12 PM
పాకిస్థా్న్ పౌరుడైన ఫహద్.. హైదరాబాద్ లో ఉంటూ తనకంటూ ఒక ఫ్లాట్ ఫాం క్రియేట్ చేసుకున్నాడు. ఒక హిందూ అమ్మాయిని ప్రేమ పెళ్లి పేరుతో మతం మార్చి పెళ్లి చేసుకుని మోసం చేశాడు. ఆ తర్వాత మరో యువతితో ప్రేమ, రాసలీలలు సాగిస్తున్న..
హైదరాబాద్, ఆగస్టు 16 : పాకిస్థాన్ పౌరుడైన ఫహద్.. హైదరాబాద్ లో ఉంటూ తనకంటూ ఒక ఫ్లాట్ ఫాం క్రియేట్ చేసుకున్నాడు. ఒక హిందూ అమ్మాయిని ప్రేమ పెళ్లి పేరుతో మతం మార్చి పెళ్లి చేసుకుని మోసం చేశాడు. ఆ తర్వాత మరో యువతితో ప్రేమ, రాసలీలలు సాగిస్తున్న ఉదంతం నిన్న బయటపడిన సంగతి తెలిసిందే. అతని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఇవాళ అతడ్ని కోర్టుకు హాజరుపర్చారు. దీంతో కోర్టు ఫహద్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతడ్ని చంచలగూడ జైలుకు తరలించారు.
ఇక, ఫహద్ వ్యవహారంపై పోలీసులు దృష్టిపెడుతున్నారు. ఎంత మంది అమ్మాయిల్ని ప్రేమ.. పెళ్లి పేరుతో మోసం చేశాడనే దానిపై హైదరాబాద్ జూబిలీహిల్స్ పోలీసుల దర్యాప్తు చేపట్టారు. అసలు ఫహద్.. భారత పౌరసత్వం ఎలా పొందాడనే వివరాలను లంగర్ హౌస్ పోలీసులు సేకరిస్తున్నారు. అటు, ఫహద్ కుటుంబసభ్యుల వివరాలు కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఒక వేళ అక్రమంగా భారత్ కు వచ్చినట్టైతే, అతడ్ని పాకిస్థాన్ పంపించేందుకు కూడా హైదరాబాద్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇలా ఉండగా, ప్రేమ, పెళ్లి పేరుతో అమ్మాయిల మతం మార్చి హైదరాబాద్‌లో మోసాలకు పాల్పడుతున్నాడన్న కేసులో పాకిస్థాన్ యువకుడు ఫహద్ ను పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. ఇక, కేసు వివరాల్లోకి వెళ్తే, హైటెక్ సిటీ దగ్గరున్న సిపాల్ కంపెనీలో పనిచేస్తుండగా పాకిస్థాన్ యువకుడు ఫహద్.. కీర్తి అనే అమ్మాయిని ప్రేమలోకి దింపాడు. హిందూ మతానికి చెందిన కీర్తిని.. దోహా ఫాతిమాగా పేరు, మతం మార్చి 2016 లో పెళ్లి చేసుకున్నాడు. అయితే, మరో యువతిని ప్రేమలోకి దింపే యత్నాల్లో తన భర్త ఉన్నాడని గ్రహించిన ఫాతిమా భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.
బంజారాహిల్స్ మౌంట్ బంజారా కాలనీలో తన భర్త రాసలీలలు సాగిస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకున్న ఫాతిమా నిన్న ఉదయం అక్కడికి వెళ్లింది. సిపాల్ కంపెనీలో పనిచేసిన మరో మహిళతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు పాకిస్థాన్ యువకుడు ఫహద్. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చి భర్తను మరో మహిళను పట్టించింది భార్య దోహా ఫాతిమా. దీంతో పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకొని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, ఫహద్.. 1998లో పాకిస్థాన్ నుండి భారత్ వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడ్డాడు. అమ్మాయిల మతం కన్వర్ట్ చేసి ప్రేమ పేరుతో, పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
మరింతగా తగ్గిన బంగారం ధర.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News