Home » Operation Sindoor
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన సంగతి తెలిసిందే. 2025, మే 7వ తేదీన భారత వైమానిక దళాలు పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశాయి. నేటితో (గురువారం) ఆపరేషన్ సిందూర్‌కు ఏడాది పూర్తయింది.
ఆపరేషన్ సిందూర్ మొదలై ఏడాది పూర్తైన సందర్భంగా భారత వైమానిక దళం (IAF) ఓ శక్తివంతమైన వీడియోను విడుదల చేసింది. 'భారత్ దేనినీ క్షమించదు' అనే సందేశంతో విడుదలైన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి భారత్‌పై తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. భవిష్యత్తులో భారత్ నుంచి ఎలాంటి దాడి జరిగినా పాకిస్థాన్ మరింత తీవ్రంగా, నిర్ణయాత్మకంగా స్పందిస్తుందని హెచ్చరించారు.
గతేడాది భారత్ నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్'లో హతమైన ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆర్మీ సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిందని పాక్ నేత షహీర్ సియాల్వి సంచలన వ్యాఖ్యలు చేశారు. నజ్రియాతీ పార్టీ చైర్మన్ అయిన షహీర్ సియాల్వి, తాజాగా లష్కరే తోయిబా నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు.
భారతదేశం మరో యుద్ధానికి సిద్ధమవుతోందని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ పేర్కొన్నారు. పాకిస్థాన్ పార్లమెంటు సంయుక్త సమావేశంలో మాట్లాడిన జర్దారీ.. భారతదేశం ఇస్లామాబాద్‌తో మరో యుద్ధానికి సిద్ధమవుతోందని ఆరోపించారు.
గతేడాది భారత్-పాక్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మాట్లాడారు. ఈ రెండు దేశాల మధ్య జరగాల్సిన అణు యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి చెప్పుకున్నారు. అయితే ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కాస్త గందరగోళానికి తెరతీశాయి.
కేరళ లిటరేచర్ ఫెస్టివల్ సందర్భంగా మీడియా అడిగిన ఒక ప్రశ్నకు శశిథరూర్ స్పందిస్తూ, ఆపరేషన్ సిందూర్ అంశలో తాను ఒక బలమైన నిర్ణయం తీసుకున్నానని, దానిపై తాను క్షమాపణ కోరనని తెలిపారు.
గత ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 26 మంది అమాయకులు చనిపోయారు. దీంతో భారత్ లో పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు చెలరేగాయి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది భారత సైన్యం.
ఎలాంటి పరిస్థితులైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు క్షిపణి, రాకెట్ ఫోర్స్‌ను ఇండియన్ ఆర్మీ సిద్ధం చేస్తోందని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది చెప్పారు. జమ్మూకశ్మీర్‌లో పాక్ వైపు నుంచి జనవరి 10న సుమారు ఆరు డ్రోన్‌లు, జనవరి 11, 12 తేదీల్లో రెండు నుంచి మూడు డ్రోన్‌లు కనిపించాయని తెలిపారు.
పొరుగుదేశాలతో నిర్మాణాత్మక సహకారానికి భారత్ కట్టుబడి ఉంటుందని, రెండ్రోజుల క్రితమే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా అంత్యక్రియలకు భారత్ ప్రతినిధిగా తాను ఢాకా వెళ్లాలని ఎస్ జైశంకర్ చెప్పారు.