Home » Nirmala Sitharaman
బీహార్ అసెంబ్లీ ఎన్నికల సంవత్సరాన్ని పురస్కరించుకుని సహజంగానే ఆ రాష్ట్రంపై బీజేపీ ప్రేమ కురిపించిందని జైరామ్ రమేష్ అన్నారు. 2025-2026 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ పార్లమెంటులో శనివారంనాడు ప్రవేశపెట్టారు.
Harish Rao: ‘‘2024 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్, 2025 ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల కోసం బడ్జెట్ పెట్టారు.. 2026 యూపీ బడ్జెట్, 2027 గుజరాత్ కోసం బడ్జెట్ పెడుతారా? యావత్ దేశానికి సరిపోయే బడ్జెట్ ఎప్పుడు పెడతారు? బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి చోటు లేదా? తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు విలువ లేదా? అంటూ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి హరీష్‌రావు.
Bandi Sanjay: ఇది సంక్షేమ బడ్జెట్- ప్రజల పెన్నిధి నరేంద్రమోదీ అని కేంద్రమంత్రి బండి సంజయ్ కొనియాడారు. 2027 నాటికి అమెరికా, చైనా తరువాత మూడో ఆర్ధిక వ్యవస్థగా భారత్ అవతరించే దిశగా బడ్జెట్‌ను రూపకల్పన చేశారన్నారు. పత్తి, పప్పు దినుసులు పండించే రైతులకు లాభదాయకమైన బడ్జెట్ అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల పక్షపాతి అనడానికి నిదర్శనమిది అని అన్నారు.
వరసగా 8వసారి బడ్డెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. భారీ ధర ఉన్న ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు ఇకపై ప్రజలకు చౌక ధరకే లభిస్తాయని ప్రకటించారు..
ఢిల్లీ: 2025-26 ఆర్థిక సంవత్సరంలో అప్పులు, ఇతర మార్గాల ద్వారా కేంద్ర ప్రభుత్వం 24 శాతం ఆదాయం సమకూర్చుకోనుంది. ఆదాయపు పన్ను ద్వారా 22 శాతం ఆదాయం కేంద్రానికి రానుంది. కేంద్ర ఎక్సైజ్ నుంచి 5 శాతం, జీఎస్టీ, ఇతర పన్నుల నుంచి 18 శాతం ఆదాయం రానుంది.
2025-26 ఏడాదికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో అనేక రంగాల్లో సరికొత్త సంస్కరణలను తీసుకొచ్చారు. అలాగే విద్య, వ్యవసాయం, టెక్నాలజీ రంగాలకు అనేక ప్రోత్సాహకాలను అందించారు. ఈ బడ్జెట్‌తో కొత్తగా ఏయే వస్తువుల ధరలు తగ్గనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Budget 2025: గిగ్ వర్కర్లకు ఈ-శ్రమ్ పోర్టల్ ద్వారా ఐడీ కార్డులు జారీ చేయనున్నట్లు కేంద్రమంత్రి తన ప్రసంగంలో తెలిపారు. పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు ప్రకటించారు. ఈ బీమా ద్వారా కోటి మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం చేకూరనుందని కేంద్రమంత్రి నిర్మల ప్రకటించారు.
CII on Budget 2025: న్యూ ఇన్‌కమ్‌ట్యాక్స్ బిల్లు మిడిల్ క్లాస్‌కు ఉపయోగపడుతుందని.. ఇది పెద్ద విప్లవమే అని చెప్పాలన్నారు. సీఐఐ చైర్మన్ డీవీ రవీంద్రనాధ్ అన్నారు. కేంద్ర వార్షిక బడ్జెట్‌పై సీఐఐ స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
Budget 2025 For Healthcare Sector: ఆ పేషెంట్స్‌కు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ప్రాణాలు కాపాడే 36 రకాల మందులపై ధరల్ని బాగా తగ్గించింది సర్కారు.
Budget 2025: రూ. 50,65,345 కోట్లతో 2025-26 ఏడాది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్. రక్షణ శాఖకు అధికంగా నిధులు కేటాయించింది కేంద్రం.