Share News

CM Chandrababu Delhi Tour : సాస్కి కింద అదనంగా ఐదు వేల కోట్లు ఇవ్వండి: ఢిల్లీలో చంద్రబాబు

ABN , Publish Date - Aug 22 , 2025 | 03:38 PM

ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. ఏపీకి ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం రూ. 2,010 కోట్లు లభించాయని, ఇంకా ఐదు వేలకోట్లు..

CM Chandrababu Delhi Tour : సాస్కి కింద అదనంగా ఐదు వేల కోట్లు ఇవ్వండి: ఢిల్లీలో చంద్రబాబు
CM Chandrababu Delhi Tour

అమరావతి, ఆగస్ట్ 22 : ఢిల్లీ వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ (శుక్రవారం) కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. రాష్ట్రంలో చేపట్టే పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించవలసిందిగా కేంద్ర ఆర్ధికమంత్రిని ముఖ్యమంత్రి కోరారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటివరకు ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం (SASCI-Special Assistance to States for Capital Investment ) పథకం కింద రూ. 2,010 కోట్లు లభించాయని తెలిపారు.

Cm-Chandabau-in-Delhi.jpg


రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న మూలధన ప్రాజెక్టుల కోసం అదనంగా రూ. 5,000 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి, కేంద్ర ఆర్థిక మంత్రికి వినతి పత్రం సమర్పించారు. అలాగే 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సింగిల్ నోడల్ ఏజెన్సీ (SNA Sparsh) ప్రోత్సాహక పథకం మార్గదర్శకాల ప్రకారం రూ. 250 కోట్ల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై తగు ఉత్తర్వులు ఇవ్వాలని వినతి పత్రంలో పేర్కొన్నారు.

Cm-Chandabau-in-Delhi.jpgతూర్పు ప్రాంత రాష్ట్రాల సమగ్రాభివృద్ధి కోసం కేంద్రం ప్రకటించిన పూర్వోదయ పథకాన్ని స్వాగతిస్తున్నామని చెప్పిన ముఖ్యమంత్రి..ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనం పొందగలదని తెలిపారు. దీని విధివిధానాలు రూపొందించి త్వరగా ఈ పథకాన్ని అమల్లో తేవాలని ముఖ్యమంత్రి కోరారు.


ఇవి కూడా చదవండి

కాంగ్రెస్, ఆర్జేడీ చొరబాటుదారుల్ని ప్రోత్సహిస్తున్నాయి, త్వరలో జనాభా మిషన్‌: ప్రధాని మోదీ

కోఆపరేటివ్ బ్యాంకులకూ పూర్తిస్థాయి ఆధార్ ఆథెంటికేషన్ సేవలు.. యూఐడీఏఐ నిర్ణయం

Updated Date - Aug 22 , 2025 | 03:42 PM