Home » New Zealand
న్యూజిలాండ్ క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది. కివీస్ ఐకానిక్ క్రికెటర్ బాబ్ బ్లేయర్ తుది శ్వాస విడిచారు. ఆయనకు పలువురు స్టార్ క్రికెటర్లు సంతాపం తెలియజేశారు.
రెండో టెస్ట్‌లో ఇంగ్లండ్‌ను 253 పరుగుల తేడాతో న్యూజిలాండ్ చిత్తు చేసింది. దీంతో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను కివీస్ 1-1తో సమం చేసింది. లండన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 391 పరుగుల భారీ పరుగులను సాధించింది.
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్2026లో డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్‌కు త్రుటిలో పరాభవం తప్పింది. శుక్రవారం ఐర్లాండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో కివీస్ జట్టు 4 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మహిళల టీ20 ప్రపంచకప్2026లో డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్‌కు వరుసగా రెండో షాక్ తగిలింది. మంగళవారం గ్రూప్-2 పోరులో లంక 5 వికెట్ల తేడాతో కివీస్‌ను ఓడించింది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో న్యూజిలాండ్ ఓడిన సంగతి తెలిసిందే.
ఫిఫా ప్రపంచకప్ 2026 ప్రయాణాన్ని ఇరాన్ జట్టు డ్రాతో ఆరంభించింది. గ్రూప్-జిలో భాగంగా లాస్ ఏంజిల్స్ వేదికగా ఇవాళ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను ఇరాన్ 2-2తో డ్రా చేసుకుంది.
రాజస్థాన్ రాయల్స్ స్టార్ బ్యాటర్ సూర్యవంశీ వైభవ్ పేరు దేశాన్ని దాటి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ 15 ఏళ్ల చిచ్చర పిడుగు ఐపీఎల్ 2026లో పెను విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా...
సింగపూర్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక 'షాంగ్రి-లా డైలాగ్' సదస్సు వేదికగా భారత్ తన రక్షణ దౌత్యాన్ని మరింత బలోపేతం చేసుకుంది. ఈ సదస్సు సందర్భంగా భారత రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్.. సింగపూర్, న్యూజిలాండ్ దేశాల రక్షణ శాఖ మంత్రులతో విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్లు కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్‌లు ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 12 విభిన్న దేశాలలో టెస్ట్ క్రికెట్ ఆడిన తొలి జంటగా వారిద్దరూ రికార్డులెక్కారు.
స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో తలపడేందుకు ఇంగ్లండ్ పురుషుల క్రికెట్ జట్టు సిద్దమైంది. జూన్ 4 నుంచి లార్డ్స్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఇవాళ ప్రకటించింది.
భారత్, న్యూజిలాండ్ మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా భారత ఎగుమతులకు భారీ మద్దతు లభించనుంది. ముఖ్యంగా, న్యూజిలాండ్‌కు వెళ్లే భారత వస్తువులపై దిగుమతి సుంకం పూర్తిగా రద్దు చేయడం ఈ డీల్‌లో కీలక అంశం.