Kane Williamson Record: కేన్ విలియమ్సన్ ఖాతాలో భారీ రికార్డు
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:07 AM
న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో ఈ ఘనత సాధించాడు. వెయ్యి పరుగులు చేసిన రెండో న్యూజిలాండ్ ప్లేయర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఓ భారీ(Kane Williamson Test Record) రికార్డును సొంతం చేసుకున్నాడు. క్రైస్ట్‌చర్చ్‌లో ఇవాళ (డిసెంబర్ 2)వెస్టిండీస్, కివీస్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్(NZ vs West Indies 1st Test) తొలి ఇన్నింగ్స్‌లో 102 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేసి కేన్ విలియమ్సన్ ఔటయ్యాడు. ఈ క్రమంలో విండీస్‌పై టెస్ట్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న రెండో న్యూజిలాండ్ ఆటగాడిగా కేన్(1022) రికార్డుల్లోకెక్కాడు. కేన్‌కు ముందు రాస్ టేలర్(1136) మాత్రమే ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లోనే కేన్ మరో ఘనత కూడా సొంతం చేసుకున్నాడు. టెస్ట్‌ల్లో విండీస్‌పై అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన ప్లేయర్‌గా నాథన్ ఆస్టల్ రికార్డును సమం చేశాడు. కేన్, నాథన్ ఇద్దరూ కరేబియన్ జట్టుపై టెస్టుల్లో చెరో 8 అర్ధ శతకాలు చేశారు.
వెస్టిండీస్‌పై NZ తరపున అత్యధిక టెస్ట్ పరుగులు
రాస్ టేలర్- 1136
కేన్ విలియమ్సన్ - 1022
గ్లెన్ టర్నర్ - 855
BE కాంగ్డన్ - 764
నాథన్ ఆస్టల్ - 715
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి టెస్టులో న్యూజిలాండ్(New Zeland) తడబాటుకు లోనైంది. 120 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్ డెవాన్ కాన్వే డకౌటయ్యాక కేన్ విలియమ్సన్, కెప్టెన్ లాథమ్ (24) కాసేపు నిలకడగా బ్యాటింగ్ చేశారు. 94 పరుగుల జట్టు స్కోర్ వద్ద కేన్ ఔట్ కావడంతో పరిస్థితి మారిపోయింది. ఆ తరువాత వెంటనే లాథమ్ కూడా పెవిలియన్ చేరాడు. మరో 8 పరుగుల వ్యవధిలో రచిన్ రవీంద్ర (3) కూడా జేడెన్ సీల్స్ ఔట్ చేశాడు. మరో 17 పరుగుల తర్వాత విల్ యంగ్ (14) కూడా పెవిలియన్‌కు చేరాడు. విండీస్ బౌలర్లలో రోచ్, సీల్స్, లేన్, ఓజే షీల్డ్స్ తలో వికెట్ తీయగా.. గ్రీవ్స్ 2 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం 60 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి కివీస్ జట్టు 192 పరుగలు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో బ్రేస్‌వెల్(31), నాథన్ స్మిత్(18) క్రీజ్‌లో ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
Moeen Ali IPL Retirement: ఐపీఎల్‌కు మరో స్టార్ ప్లేయర్ దూరం
ప్రియురాలితో స్టార్ మహిళా క్రికెటర్ ఎంగేజ్‌మెంట్