Share News

Tirupati: తిరుచానూరులో దారుణం.. ఒకే ఇంట్లో..

ABN , Publish Date - Dec 02 , 2025 | 09:11 AM

ఇంట్లో నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండడంతో.. పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఆ ఇంటి తలపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లిన పోలీసులు షాక్‌కు గురయ్యారు.

Tirupati: తిరుచానూరులో దారుణం.. ఒకే ఇంట్లో..
Tiruchanur

తిరుపతి, డిసెంబర్ 02: తిరుచానూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని దామినేడు ఇందిరమ్మ గృహా సముదాయంలో దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా ఒక ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి ఆ ఇంటి తలుపులు పగలకొట్టారు. ఆ ఇంట్లో నిర్జీవంగా పడి ఉన్న మూడు మృతదేహాలను గుర్తించారు. అనంతరం ఈ మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు సత్యరాజ్, పొన్నాగుట్టె నాయగి, మనీష్‌గా పోలీసులు గుర్తించారు. ఒకే ఇంట్లో మూడు మృతదేహాలు బయటపడడంతో స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఈ సందర్భంగా సత్యరాజ్‌ గురించి స్థానికులను పోలీసులు విచారిస్తున్నారు. సత్యరాజ్ స్వస్థలం.. తమిళనాడులోని గుడియాతం. అతడు భార్యను వదిలి.. అదే ప్రాంతానికి చెందిన పొన్నాగుట్టె నాయగి (30)తో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. మూడు నెలల క్రితం నాయగితోపాటు ఆమె మూడేళ్ల కుమారుడితో కలిసి గుడియాతం నుంచి దామినేడు ఇందిరమ్మ గృహ సముదాయంలోని ఇంట్లో కాపురం పెట్టాడు. స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ వీరు జీవనం సాగిస్తున్నారు.


అయితే నవంబర్ 22వ తేదీ ముందు వీరిని చూశామని.. ఆ తర్వాత వీరు ఇంటి నుంచి బయటకు రాలేదని పోలీసుల విచారణలో స్థానికులు వివరించారు. మహిళతోపాటు ఆమె కుమారుడిని చంపి సత్యరాజ్ ఆత్మహత్య చేసుకున్నాడా ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై తమిళనాడులోని గుడియాత్తం పోలీసులకు తిరుచానూరు పోలీసులు సమాచారం అందించారు. సత్యరాజ్ కుటుంబ సభ్యులు వస్తేనే కానీ అసలు విషయాలు బహిర్గతం కావని పోలీసులు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విమానానికి బాంబు బెదిరింపు.. ముంబైకి మళ్లింపు

మెట్రోస్టేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలు..

For More AP News And Telugu News

Updated Date - Dec 02 , 2025 | 10:11 AM