Hyderabad: మెట్రోస్టేషన్లలో ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాలు..
ABN , Publish Date - Dec 02 , 2025 | 08:07 AM
ట్రాన్స్‌జెండర్లకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ఓ కార్యాచరణను సిద్ధం చేసింది. కూడళ్లు, రద్దీ ఏరియాల్లో ట్రాన్స్‌జెండర్ల ఆగడాలు మితిమీరిపోతుంటాయి. ఇది ప్రజలకు తీవ్ర ఇబ్బందుకు కలిగిస్తోంది. అయితే దీని నివారణకు గాను వారికి ఉపాధి కల్పించడం ద్వాకా సమస్యను నివారంచవచ్చని తలిచి వారికి నగరంలోని మెట్రోస్టేషన్లలో సెక్యూరిటీ ఉద్యోగాలను ఇస్తోంది.
- సెక్యూరిటీ సిబ్బందిగా విధులు
హైదరాబాద్ సిటీ: ట్రాన్స్‌జెండర్లకు(Transgender) చేయూతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మెట్రోస్టేషన్లలో(Metro stations) కూడా పనిచేసేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ఎంపిక చేసిన స్టేషన్లలో 20 మంది సిబ్బంది సోమవారం విధుల్లో చేరారు. రోజూ సుమారు 5 లక్షల మంది వరకు మెట్రోలో ప్రయాణిస్తున్నారు. మొత్తం ప్రయాణికుల్లో మహిళలు సుమారు 30 శాతం మంది ఉంటున్నారు.

ఈ నేపథ్యంలో వారి భద్రతను దృష్టిలో ఉంచుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకున్న 20 మంది ట్రాన్స్‌జెండర్ సిబ్బందిని మెట్రోస్టేషన్లలో సెక్యూరిటీ విభాగం(Security Department)లో నియమించింది. వీరు స్కానర్(Scanner) కార్యకలాపాలు, స్ర్టీట్-లెవెల్, కాన్‌కోర్స్ భద్రత విధులను నిర్వర్తిస్తారని అధికారులు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..
ఐఏఎస్ అధికారి కుమార్తె ఆత్మహత్య
Read Latest Telangana News and National News