Share News

Chloe Tryon: ప్రియురాలితో స్టార్ మహిళా క్రికెటర్ ఎంగేజ్‌మెంట్

ABN , Publish Date - Nov 30 , 2025 | 11:33 AM

దక్షిణాఫ్రికా మహిళా క్రికెటర్ క్లోయీ ట్రయాన్ తన ప్రియురాలు మిచెల్ నేటివెల్‌తో నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎంగేజ్‌మెంట్ ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి.

 Chloe Tryon: ప్రియురాలితో స్టార్ మహిళా క్రికెటర్ ఎంగేజ్‌మెంట్
Chloe Tryon

ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ చరిత్రలో ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. సౌతాఫ్రికా మహిళా స్టార్ క్రికెటర్ క్లోయీ ట్రయాన్(Chloe Tryon).. తన ప్రియురాలు మిచెల్ నేటివెల్‌(Michelle Natwell)ను ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. సోషల్ మీడియా వేదికగా ట్రయాన్ ఈ శుభవార్తను పంచుకుంది. కాగా డబ్ల్యూపీఎల్ 2026 వేలంలో ముంబై జట్టులో చేరిన కొద్ది రోజులకే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.


సాధారణంగా ఏ క్రీడాకారులైనా నిశ్చితార్థం లేదా పెళ్లి చేసుకుంటే అభిమానులు సంబరపడిపోవడం సహజమే. దానికి సంబంధించిన ప్రతి పోస్ట్‌ను, వీడియోను తెగ వైరల్ చేసేస్తారు. కానీ ట్రయాన్ ఈ నిశ్చితార్థం ప్రకటన చేశాక అభిమానులు షాక్ అయ్యారు. ముఖ్యంగా మేల్ ఫ్యాన్స్ హృదయాలు ముక్కలయ్యాయి. నవంబర్ 29న ట్రయాన్ నిశ్చితార్థం చేసుకుని.. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవి క్షణాల్లోనే వైరలయ్యాయి. కాగా మిచెల్ నేటివెల్ జింబాబ్వేకి చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్.


క్రికెట్ రికార్డులివే..

30-trayon.jpg

సౌతాఫ్రికాకు చెందిన ట్రయాన్.. 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. టీ20 ఫార్మాట్‌లో ఈమెపై ఓ అరుదైన రికార్డు ఉంది. అరంగేట్ర మ్యాచ్‌లో తొలి బంతికే వికెట్ తీసిన ఏకైక ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. ఆమె దక్షిణాఫ్రికా జట్టుకు వైస్-కెప్టెన్‌గా కూడా పని చేసింది. ముఖ్యంగా 2022 మహిళల వన్డే ప్రపంచ కప్‌లో జట్టులో కీలక పాత్ర పోషించింది. బీసీసీఐ నిర్వహించే మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో క్లోయీ ట్రయాన్ స్టార్ ప్లేయర్. ఆమెను 2026 ఎడిషన్ కోసం జరిగిన వేలంలో పటిష్టమైన ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసింది.


ఇవి కూడా చదవండి:

రో-కో జోడీ రాహుల్‌కి బలం: బవుమా

విరాట్‌కు కలిసొచ్చిన కేఎల్ కెప్టెన్సీ.. సెంచరీ రిపీట్ అవ్వనుందా?

Updated Date - Nov 30 , 2025 | 11:33 AM