Ind Vs SA: రో-కో జోడీ రాహుల్‌కి బలం: బవుమా
ABN , Publish Date - Nov 30 , 2025 | 09:00 AM
రాంచి వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. దీనిపై సఫారీల కెప్టెన్ బవుమా స్పందించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులోకి తిరిగి రావడం.. కెప్టెన్ రాహుల్‌కు బలమని పేర్కొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: రాంచి వేదికగా సౌతాఫ్రికా-టీమిండియా జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. భారత్‌తో టెస్టు సిరీస్‌లో ఘన విజయం సాధించిన సఫారీ సేన.. అదే ఆత్మవిశ్వాసంతో వన్డే సిరీస్‌ను ఆరంభించనుంది. మరోవైపు కొంత విరామం తర్వాత స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మైదానంలో అడుగుపెట్టారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయాలతో జట్టుకు దూరం కావడంతో కేఎల్ రాహుల్ టీమిండియాను నడిపించబోతున్నాడు. ఈ సిరీస్ గురించి తాజాగా సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా(Temba Bavuma) స్పందించాడు.
‘టెస్టు సిరీస్ మధ్యలో కెప్టెన్ గిల్ గాయపడటం మాకు కలిసొచ్చింది. మా గెలుపుకి అది కూడా ఓ కారణమే. అయితే వన్డే మ్యాచ్ విషయంలో పరిస్థితులు భిన్నంగా ఉండొచ్చు. కేఎల్ రాహుల్ కాస్త బెటర్ పొజిషన్‌లో ఉన్నారు. స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చారు. వారు సాధారణంగానే మ్యాచ్ విషయంలో బాధ్యతగా ఉంటారు. ఇది కెప్టెన్‌పై కాస్త ఒత్తిడి తగ్గిస్తుంది. రో-కో జోడి రాహుల్‌కి బలం. ఆల్ ది బెస్ట్ రాహుల్’ అని బవుమా వ్యాఖ్యానించాడు.
ఎలా ఎదుర్కొంటారో..?
సఫారీల వన్డే జట్టులో చాలా మార్పులే చూడబోతున్నాం. టెస్టు జట్టు నుంచి కెప్టెన్ బవూమాతో పాటు మార్‌క్రమ్, యాన్సెన్, కేశవ్ మహరాజ్, కార్బిన్ బోష్‌లు ఇందులో ఆడనున్నారు.బవుమా, మార్‌క్రమ్‌లకు తోడు దూకుడుగా ఆడే డికాక్, బ్రీట్జ్‌కే, బ్రెవిస్, రుబిన్ హెర్మన్ భారత బౌలర్లకు సవాలు విసరడం ఖాయం. గాయం కారణంగా ప్రధాన పేసర్ రబాడ దూరం కావడం సఫారీ జట్టుకు ప్రతికూలతే. అయితే యాన్సెన్, బర్గర్, ఎంగిడి, బోష్‌లతో పేస్ విభాగం మెరుగ్గానే ఉంది. స్పెషలిస్టు స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌కు తోడు మార్‌క్రమ్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నాడు.
ఇవి కూడా చదవండి:
పాకిస్తాన్‌దే ముక్కోణపు సిరీస్