Tri-Series: పాకిస్తాన్‌దే ముక్కోణపు సిరీస్
ABN , Publish Date - Nov 30 , 2025 | 07:08 AM
స్వదేశంలో జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. నవాజ్, షహీన్, అబ్రార్ అహ్మద్ బౌలింగ్ ధాటికి శ్రీలంక 114కి కుప్పకూలింది. లక్ష్య ఛేదనలో పాక్ నాలుగు వికెట్లు కోల్పోయి.. లంకపై 6 వికెట్ల తేడాతో గెలిచింది.
ఇంటర్నెట్ డెస్క్: స్వదేశంలో జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్(Tri-Series)లో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. శనివారం ఫైనల్‌లో ఆ జట్టు ఆరు వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 114 పరుగులకే కుప్పకూలింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’మహ్మద్ నవాజ్(3/17), షహీన్ అఫ్రిది(3/18), అబ్రార్ అహ్మద్(2/18)లు లంక పతనాన్ని శాసించారు. ఓ దశలో 98/2తో మెరుగైన స్థితిలో ఉన్న శ్రీలంక.. కేవలం 16 పరుగుల తేడాలో 8 వికెట్లు కోల్పోయింది.
పాక్ కూడా..
115 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కి దిగిన పాకిస్తాన్.. ఆదిలో కాస్త ఇబ్బంది పడింది. అయినప్పటికీ సయిమ్ అయూబ్(36), బాబర్ అజామ్(37*) జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. పాక్ 18.4 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కాగా జింబాబ్వే ఈ టోర్నీలో పోటీ పడ్డ మూడో జట్టు.
ఇవి కూడా చదవండి:
కచ్చితంగా టీమిండియాలోకి తిరిగొస్తా.. ఉమ్రాన్ మాలిక్ ఆశాభావం
పంత్‌ను చూసి నవ్వుకున్న ఫొటోగ్రాఫర్.. అసలేమైందంటే?