Share News

India-New Zealand: భారత్-న్యూజిలాండ్ FTAతో ఉద్యోగాలు, ఆదాయ, వాణిజ్యం – ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్

ABN , Publish Date - Dec 27 , 2025 | 09:06 AM

భారత్ - న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చింది. న్యూజిలాండ్ ప్రధానమంత్రి దీనిపై సంతోషం వ్యక్తం చేశారు. 1.4 బిలియన్ భారతీయ కన్స్యూమర్లకు తలుపులు తెరవడం ద్వారా, మరిన్ని ఉద్యోగాలు, ఎక్కువ ఆదాయాలు..

India-New Zealand: భారత్-న్యూజిలాండ్ FTAతో ఉద్యోగాలు, ఆదాయ, వాణిజ్యం – ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్
New Zealand Prime Minister Christopher Luxon

ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 27: భారత్ - న్యూజిలాండ్ మధ్య చారిత్రక.. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం (FTA) పూర్తయింది. ఈ ఒప్పందం గురించి న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 'మా మొదటి టర్మ్‌లో భారత్‌తో FTA సాధించామని చెప్పాం, ఇప్పుడు అది నెరవేర్చాం. ఈ ల్యాండ్‌మార్క్ ఒప్పందం 1.4 బిలియన్ భారతీయ కన్స్యూమర్లకు తలుపులు తెరిచి, మరిన్ని ఉద్యోగాలు, ఎక్కువ ఆదాయాలు, ఎక్కువ ఎగుమతులు తెస్తుంది' అని పేర్కొన్నారు.


New-Zealand-PM.jpg

ఒప్పందంలోని ప్రధాన అంశాలు:

ఒప్పందం మార్చి 16, 2025న ప్రారంభమై, కేవలం 9 నెలల్లో పూర్తయింది. భారత్‌కు అత్యంత వేగవంతమైన FTAలలో ఒకటి.

భారత ఎగుమతులకు 100% డ్యూటీ-ఫ్రీ యాక్సెస్ (టెక్స్‌టైల్స్, లెదర్, మెరైన్ ప్రొడక్ట్స్, జెమ్స్ & జ్యువెలరీ వంటివి).

న్యూజిలాండ్ ఎగుమతులపై 95% టారిఫ్‌ల తగ్గింపు లేదా రద్దు.

సర్వీసెస్ రంగంలో (IT, ఎడ్యుకేషన్, టూరిజం) మరిన్ని అవకాశాలు.

భారత నిపుణులకు 5,000 తాత్కాలిక వీసాలు (IT, ఇంజినీరింగ్, హెల్త్‌కేర్ వంటివి).

ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 సంవత్సరాల్లో రెట్టింపు చేయడం, న్యూజిలాండ్ నుంచి $20 బిలియన్ పెట్టుబడులు లక్ష్యంగా దీన్ని రూపొందించారు.


ఈ FTA రెండు దేశాలకు ఆర్థిక వృద్ధి, ఉద్యోగాల సృష్టి, MSMEలకు మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా ఇది ఒక మైలురాయని భారత ప్రభుత్వం చెబుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

బంగారం ధరల్లో 5 రోజులుగా ర్యాలీ! ప్రస్తుత రేట్స్ ఇవీ..

3, 4, 5 తేదీల్లో మూడవ తెలుగు మహాసభలు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 27 , 2025 | 09:55 AM