Home » Miss World 2025
థాయ్‌లాండ్ భామ ఓపల్ సుచాత మిస్ వరల్డ్ కిరీటాన్ని దక్కించుకున్నారు. 72వ మిస్ వరల్డ్‌గా ఓపల్ సుచాత విజేతగా నిలిచారు. థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో ఆమె జన్మించారు.
Miss World 2025: 72వ మిస్ వరల్డ్ పోటీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాత విజేతగా నిలిచింది. మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని కైవసం చేసుకుంది.
మిస్ వరల్డ్ ఫైనల్స్ పోటీలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. శనివారం నాడు ఈ పోటీల ఫైనల్స్ జరుగుతున్నాయి. హైటెక్స్ వేదికగా ఘనంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పలువురు అందాల భామలు పాల్గొని కనువిందు చేస్తున్నారు.
అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ సుందరి విజేత ఎవరో నేడే తేలిపోనుంది. హైటెక్స్‌లో శనివారం సాయంత్రం 5.30 గంటలకు ప్రపంచ సుందరి పోటీల తుది ఘట్టం మొదలుకానుంది.
చెక్ రిపబ్లిక్‌లోని ఓ గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించా. బాల్యమంతా పంట పొలాల మధ్య గడిపా. మిస్ వరల్డ్ విజేతగా నిలవడం జీవితాశయంగా పెట్టుకున్నా. కష్టపడి దాన్ని సాధించా’అని మిస్ వరల్డ్-24 విజేత క్రిస్టినా ప్లిస్కోవా చెప్పారు.
గత మూడు వారాలుగా కొనసాగుతున్న ప్రపంచ అందాల పోటీలు తుది దశకు చేరుకున్నాయి. శనివారం సాయంత్రం మిస్ వరల్డ్-2025 ఫైనల్ కోసం నగరం సిద్ధమైంది.
ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక అందాల పోటీల్లో మిస్ వరల్డ్ ఒకటి. ఈ కిరీటాన్ని గెలుచుకోవమనేది కేవలం అందానికి మాత్రమే కాదు.. అపారమైన కీర్తి, ఆర్థిక స్థిరత్వం, ప్రపంచవేదికపై గొప్ప ప్రభావాన్ని చూపే అవకాశాన్ని అందిస్తుంది.
మేఘా కృష్ణారెడ్డి సతీమణి, సుధారెడ్డి ఫౌండేషన్ అధినేత్రి సుధారెడ్డి సోమవారం రాత్రి మిస్ వరల్డ్ పోటీదారుల కోసం ప్రత్యేకంగా ‘బ్యూటీ విత్ ఏ పర్పస్’ గాలాను నిర్వహించారు.
మిస్ వరల్డ్ పోటీలకు హాజరైన యువతులను చూస్తే దేవలోకం నుంచి ఇప్పుడే భువికి దిగి వచ్చిన దేవతల్లా కనిపిస్తున్నారు. అయితే నిజానికి వారి దారి మెుత్తం ముళ్లబాట. ఒక్కొక్కరి జీవితం గురించి తెలిస్తే కన్నీళ్లు పెట్టకు మానరు. అలాంటి పరిస్థితులను ఎదుర్కొని విశ్వవేదికపై పోటీ పడే వారి పోరాట స్ఫూర్తి చూస్తే సెల్యూట్ చేయాల్సిందే.
మహిళల ప్రాణాలను హరించే ఆటవిక ఆచారాలను భరించింది ఓ వనిత. అదృష్టవశాత్తు బతికిన ఆమె.. కొండంత ధైర్యం తెచ్చుకుంది. ఆ దేశంలో మహిళల మాన, ప్రాణాలను దెబ్బతీసేలా ఉన్న మూఢాచారాలపై పోరాటాన్ని ప్రారంభించింది.